Pathaan : 32 ఏళ్ళ తర్వాత ఆ థియేటర్లో హౌస్ ఫుల్.. పఠాన్ వల్లే.. షారుఖ్ కి థ్యాంక్స్ చెప్పిన ఐనాక్స్..

ఓ ఐనాక్స్ థియేటర్ లో తాజాగా పఠాన్ సినిమా రిలీజయింది. ఆ థియేటర్లో దాదాపు 32 సంవత్సరాల తర్వాత హౌస్ ఫుల్ అయింది. పఠాన్ సినిమాకి అక్కడి ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ వస్తుండటంతో 32 ఏళ్ళ తర్వాత.................

Kaburulu

Kaburulu Desk

January 28, 2023 | 02:23 PM

Pathaan : 32 ఏళ్ళ తర్వాత ఆ థియేటర్లో హౌస్ ఫుల్.. పఠాన్ వల్లే.. షారుఖ్ కి థ్యాంక్స్ చెప్పిన ఐనాక్స్..

Pathaan :  నాలుగేళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. షారుఖ్, దీపికా పదుకొనే జంటగా జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద దర్శకత్వంలో బాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో వచ్చిన పఠాన్ సినిమా ఇటీవల జనవరి 25న రిలీజయింది. షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత రావడం, షారుఖ్ గత సినిమాలు పరాజయం అవ్వడం, పఠాన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా కావడంతో ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

పఠాన్ సినిమా థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. పాత కథే అయినా యాక్షన్ సన్నివేశంలో కరెక్ట్ గా డీల్ చేసి కథనం బాగుండటంతో ఈ సినిమా విజయం దక్కించుకుంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో బాలీవుడ్ లో కింగ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు షారుఖ్ అభిమానులు. ఇప్పటికే ఈ సినిమా 3 రోజుల్లో 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. పలు రికార్డులని సృష్టితుంది పఠాన్ సినిమా.

అయితే మన దేశంలోని కశ్మీర్‌ లోయలో థియేటర్స్ ఉన్నా ప్రేక్షకులు ఎక్కువగా రారు. అక్కడ ఉండే ఉగ్రవాద సమస్యల వల్ల థియేటర్స్ ని కూడా కొన్ని సంవత్సరాల పాటు సరిగ్గా రన్ చేయలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో 2021 నుంచి అక్కడ థియేటర్స్ మళ్ళీ గాడిలో పడ్డాయి. అక్కడ ఉన్న కొన్ని పాత థియేటర్స్ ని తీసుకొని ఐనాక్స్‌ లాంటి సంస్థలు మల్టిప్లెక్స్ లుగా మార్చాయి. అలా మార్చిన ఓ ఐనాక్స్ థియేటర్ లో తాజాగా పఠాన్ సినిమా రిలీజయింది. ఆ థియేటర్లో దాదాపు 32 సంవత్సరాల తర్వాత హౌస్ ఫుల్ అయింది. పఠాన్ సినిమాకి అక్కడి ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ వస్తుండటంతో 32 ఏళ్ళ తర్వాత ఆ థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు పెట్టారంట.

RRR : ఎవ్వరికి సాధ్యం కానీ రికార్డ్ RRRకి.. జపాన్‌లో 100 రోజులు ఆడిన ఫస్ట్ ఇండియన్ సినిమా..

కశ్మీర్ లోయలోని ఆ థియేటర్ బయట హౌస్ ఫుల్ బోర్డు ఉన్న ఫోటోని ఐనాక్స్ సంస్థ తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. దేశమంతా పఠాన్ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఇలాంటి సమయంలో 32 సంవత్సరాల తర్వాత కశ్మీర్ లోయలోని మా థియేటర్లో హౌస్‌ఫుల్ బోర్డు పెట్టాం. ఇలాంటి హౌస్ ఫుల్ ఇచ్చినందుకు కింగ్ ఖాన్‌కు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యు షారుఖ్, పఠాన్ టీం అని పోస్ట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.