3rd day Samantha kumbh 2023 brahmotsavam: మూడోరోజు సమతా కుంభ్ మహోత్సవాలు ఏ విధంగా జరిగాయో తెలుసుకున్నారా…?

Kaburulu

Kaburulu Desk

February 4, 2023 | 11:00 PM

3rd day Samantha kumbh 2023 brahmotsavam: మూడోరోజు సమతా కుంభ్ మహోత్సవాలు ఏ విధంగా జరిగాయో తెలుసుకున్నారా…?

ప్రసిద్ధ దైవ క్షేత్రమైన ముచ్చింతల్ పరిసర ప్రాంతాలన్నీ రామానుజుల వారి నామస్మరణతో మారుమ్రోగిపోతుంది. సమతా కుంభ్ మహోత్సవాలు ప్రారంభమై ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయింది. మరి మూడో రోజు విశేషాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం. 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవను ఈరోజు ఉదయం 11 గంటలకు తిరుమంజన సేవ నిర్వహించారు. నిన్న గరుడ సేవ నిర్వహించిన 18 దివ్యదేశాల ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు. స్వామివారికి నిన్నటి యాత్ర శ్రమ తీరడం కోసం తిరుమంజనం కార్యక్రమం చేస్తున్నారని శ్రీ చినజీయర్‌ స్వామి తెలిపారు.

ఈ తిరుమంజనాన్ని ఏకాంతంగా కాకుండా లోకాంతంగా నిర్వహిస్తున్నామన్నారు. సాధారణంగా కార్యక్రమం చూసేవాళ్లకు కొత్తగా ఉంటుందని, ఇక్కడ మాత్రం చేసేవాళ్లకు, చేయించేవాళ్లకు చూసేవాళ్లకు కూడా కొత్తగా ఉంటుందని చెప్పారు. శ్రీరామచంద్రుడు ఇన్ని రూపాల్లో ఒకేచోట ఉండటం అనేది ఇప్పటి వరకు జరగలేదని, ఏకంగా 18 రూపాల్లో తిరుమంజనం జరపడం అనేది అరుదని చినజీయర్ స్వామీజి అన్నారు.

ఈ క్షేత్రంలో అన్నీ కొత్తగా ఉంటాయని చినజీయర్‌స్వామి చెప్పారు. తిరుమంజనంలో భాగంగా పెరుమాళ్‌కు ముందుగా పెరుగుతో స్నానం చేయించారు, తర్వాత పాలు, తైలం, జలంతో తిరుమంజనం జరిపించారు. ఆయుర్వేదంలో పంచకర్మ చేసేప్పుడు మనకు కూడా పాలు, గంజితో ఇలానే చేస్తారని జీయర్‌స్వామి అన్నారు. దేహానికి రకరకాల స్నానాల వల్ల కొత్త శక్తి ఏర్పడుతుందని తెలిపారు.