Rakesh-Sujatha : పెళ్లితో ఒక్కటైన జబర్దస్త్ ప్రేమ జంట..
రాకేష్ - సుజాత కలిసి ట్రిప్స్ కి వెళ్లడం, ఒకరింటికి ఒకరు రెగ్యులర్ గా వెళ్లడం, పండగలు కలిసి చేసుకోవడం, కలిసి ఫోటోషూట్స్ దిగడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయినా ఈ వార్తలపై వీరిద్దరూ.............

Rakesh-Sujatha : జబర్దస్త్ తో అనేకమంది యాక్టర్స్ పేరు తెచ్చుకున్నారు. లైఫ్ సెటిల్ చేసుకున్నారు. అందులో రాకింగ్ రాకేష్ ఒకరు. రాకింగ్ రాకేష్ జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం టీం లీడర్ అయ్యాడు. తన స్కిట్స్ తో అందర్నీ పలు సంవత్సరాలుగా నవ్విస్తున్నాడు. కొన్ని నెలల క్రితం జబర్దస్త్ లోకి జోర్దార్ సుజాత వచ్చింది. జోర్దార్ న్యూస్ అనే ఓ టీవీ షోతో పాపులారిటీ తెచ్చుకున్న సుజాత అనంతరం బిగ్ బాస్ కి వెళ్లి మరింత ఫేమస్ అయింది. బిగ్ బాస్ తర్వాత పలు టీవీ షోలలో పాల్గొంటూ చివరకు జబర్దస్త్ లో చేరింది. మొదట పలు టీమ్స్ లో చేసినా చివరకు రాకింగ్ రాకేష్ టీంలో సెట్ అయింది.
దీంతో అప్పట్నుంచి రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత కలిసి స్కిట్స్ చేయడం మొదలుపెట్టారు. అలాగే స్టేజిపై రొమాన్స్ కూడా చేసేవారు. ప్రేమ మాటలు కూడా చెప్పారు. మొదట వీళ్ళు కూడా వేరే కపుల్స్ లాగా టీఆర్పీ కోసం చేస్తున్నారు అనుకున్నారు అంతా. కానీ రాకేష్ – సుజాత కలిసి ట్రిప్స్ కి వెళ్లడం, ఒకరింటికి ఒకరు రెగ్యులర్ గా వెళ్లడం, పండగలు కలిసి చేసుకోవడం, కలిసి ఫోటోషూట్స్ దిగడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయినా ఈ వార్తలపై వీరిద్దరూ అధికారికంగా స్పందించలేదు.
Sir Movie : గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కి ఫ్రీగా సార్ సినిమా చూపించిన చిత్రయూనిట్..
ఇటీవల కొన్ని రోజుల క్రితం సుజాత తన యూట్యూబ్ వీడియోలో మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, త్వరలోనే నిశ్చితార్థం చేసుకొని పెళ్లి చేసుకుంటాం అని ప్రకటించి అందరికి షాకిచ్చింది. మొదట అందరూ షాక్ అయిన తర్వాత ఈ కొత్త జంటకు కంగ్రాట్స్ చెప్పారు. తాజాగా ఈ జంట ఫిబ్రవరి 23న వివాహం చేసుకోగా పలువురు సినీ, టీవీ ప్రముఖులు వీరి వివాహానికి వచ్చి ఈ కొత్త జంటని ఆశీర్వదించారు. ప్రస్తుతం రాకేష్ సుజాతల పెళ్లి ఫోటోలు వైరల్ గా మారాయి.