Rocking Rakesh-Sujatha : జబర్దస్త్ కమెడియన్‌తో టీవీ యాంకర్ వివాహం.. గాసిప్ నిజమైందిగా..

యాంకర్ గా ప్రయాణం మొదలుపెట్టి ఓ టీవీ షోలో వార్తలతో ఫేమస్ అయి బిగ్ బాస్ వరకు వెళ్లి మరింత ఫేమ్ తెచ్చుకున్న సుజాత తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సుజాత మాట్లాడుతూ....................

Kaburulu

Kaburulu Desk

January 20, 2023 | 01:28 PM

Rocking Rakesh-Sujatha : జబర్దస్త్ కమెడియన్‌తో టీవీ యాంకర్ వివాహం.. గాసిప్ నిజమైందిగా..

Rocking Rakesh-Sujatha :  సినిమా, టీవీ పరిశ్రమలలో చాలామంది అదే పరిశ్రమకి చెందినవాళ్ళని పెళ్లి చేసుకుంటారని తెలిసిందే. ఇక కొంతమంది చెట్టాపట్టాలేసుకొని తిరిగితే వాళ్ళ మధ్య ఏదో ఉందని మీడియాలో, సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తూనే ఉంటాయి. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్, యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ సుజాత గత కొన్నాళ్లుగా కలిసి తిరుగుతుండటం, ఒకరి ఇంట్లో ఒకరు పండగలు, పూజలు చేసుకోవడం.. లాంటి వాటితో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అని వార్తలు వచ్చాయి.

జబర్దస్త్ తో పాపులారిటీ తెచ్చుకున్న రాకింగ్ రాకేష్, బిగ్ బాస్ ఫేమ్ జోర్దార్ సుజాతని జబర్దస్త్ లోనే పరిచయం మొదలయి ఇద్దరూ క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జంటగా కూడా పలు టీవీ షోలలో పాల్గొన్నారు. ఇద్దరూ కలిసి పర్సనల్ ట్రిప్స్ వేశారు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా? డేటింగ్ లో ఉన్నారా? అని అంతా అనుకున్నారు. ఇన్నాళ్లు దీనిపై మాట్లాడని వీళ్ళు తాజాగా క్లారిటీ ఇచ్చారు.

Divi Vadthya : బ్లాక్ డ్రెస్‌లో హాట్ పోజులు ఇస్తున్న దివి..

యాంకర్ గా ప్రయాణం మొదలుపెట్టి ఓ టీవీ షోలో వార్తలతో ఫేమస్ అయి బిగ్ బాస్ వరకు వెళ్లి మరింత ఫేమ్ తెచ్చుకున్న సుజాత తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సుజాత మాట్లాడుతూ.. రాకేష్ తో తన పరిచయం ఎలా జరిగింది, రాకేష్ ఎలాంటి వాడు, రాకేష్ ఫ్యామిలీ గురించి చెప్పింది. స్నేహతులుగా మొదలైన మా ప్రయాణం ఒకర్నొకరు అర్ధం చేసుకొని మరింత ముందుకు వెళ్తుందని తెలిపింది. రాకేష్ నాకు లైఫ్ లో బాగా సపోర్ట్ చేశాడని, చాలా మంచివాడని, అతని లాంటి భర్తనే కోరుకున్నాను అని తెలిపింది. ఇద్దరి ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకున్నారని, ఈ నెలాఖరులో నిశ్చితార్థం ఉంటుందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని అధికారికంగా ప్రకటించింది. వారిద్దర్నీ అంతా ఆశీర్వదించాలని కూడా కోరింది. దీంతో పలువురు టీవీ సెలబ్రిటీలు, నెటిజన్లు, అభిమానులు వీరికి కంగ్రాట్స్ చెప్తున్నారు. మొత్తానికి రాకేష్, సుజాత పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించి గాసిప్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.