Toys Cleaning : చిన్న పిల్లల బొమ్మల్ని ఎలా క్లీన్ చేయాలో తెలుసా..??
చిన్న పిల్లలు తరచుగా సాఫ్ట్ టాయ్స్ ని ఆడటానికి ఇష్టపడతారు. అవి త్వరగా మురికి పట్టడం, ఆ బొమ్మలను నోట్లో పెడితే బ్యాక్టీరియా ఇంజెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా తల్లిదండ్రులు వాటిని శుభ్రం చేయడానికి వివిధ పద్ధతులను............

Toys Cleaning : చిన్న పిల్లలు తరచుగా సాఫ్ట్ టాయ్స్ ని ఆడటానికి ఇష్టపడతారు. అవి త్వరగా మురికి పట్టడం, ఆ బొమ్మలను నోట్లో పెడితే బ్యాక్టీరియా ఇంజెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా తల్లిదండ్రులు వాటిని శుభ్రం చేయడానికి వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు. అయితే మెత్తని బొమ్మలు మాత్రమే కాదు, ప్లాస్టిక్, రబ్బరు, క్లోత్ బొమ్మలు ఇలా ఏ బొమ్మలను ఏ విధంగా శుభ్రం చేయాలో తెలుసా..
*మృదువైన బొమ్మలని శుభ్రం చేయడానికి బేబీ షాంపూని నీళ్లలో మిక్స్ చేసి అందులో బొమ్మలను ముంచి చేతులతో రుద్దుతూ శుభ్రం చేయాలి.
*క్లాత్ బొమ్మలను శుభ్రం చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈ బొమ్మలను సాధారణ సోప్ లేదా లిక్విడ్ డిటర్జెంట్ తో కడిగి ఎండలో ఆరపెడితే శుభ్రంగా బ్యాక్టీరియా లేకుండా చేస్తుంది.
*రబ్బర్ బొమ్మలు శుభ్రం చేయడానికి నీటిలో సబ్బును జోడించి స్పాంజ్ ను ముంచి బొమ్మలను శుభ్రం చేస్తే రబ్బరు బొమ్మలకు తక్షణమే మెరుపు వస్తుంది, క్లీన్ అవుతుంది.
*పిల్లలు తరచుగా స్నానం చేసేటప్పుడు కొన్ని బొమ్మలతో ఆడటానికి ఇష్టపడతారు. అటువంటి పరిస్థితిలో వారానికి ఒకసారి మీరు ఈ బొమ్మలను గోరువెచ్చటి నీటిలో శుభ్రం చేయడం ద్వారా వాటిని శుభ్రపరచవచ్చు.
*ఎలక్ట్రానిక్, బ్యాటరీ బొమ్మలను శుభ్రం చేయడానికి శానిటైజ్ వైప్స్ ను ఉపయోగించవచ్చు. ఇలా వారానికి ఒకసారి శానిటైజ్ చేస్తే సరిపోతుంది.
*చెక్క బొమ్మలు శుభ్రం చేయడానికి వెచ్చటి నీటిలో ఒక గుడ్డను నాన పెట్టి ఆ గుడ్డతో బొమ్మలను శుభ్రం చేస్తే సరిపోతుంది. పొరపాటున కూడా డైరెక్ట్ గా బొమ్మలు నీటిలో వేయకూడదని గుర్తుంచుకోండి. ఈ విధంగా బొమ్మలను శుభ్రపరచడం వలన బ్యాక్టీరియా నుండి ఇన్ఫెక్ట్ అవ్వకుండా కాపాడవచ్చు.