Sunil Babu : టాలీవుడ్ లో వరుస విషాదాలు.. సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ కన్నుమూత..

గత సంవత్సరం నుంచి టాలీవుడ్ లో వరుసగా పలువురు ప్రముఖులు మరణిస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో వరుస విషాదాలు ఏర్పడ్డాయి. ఆ విషాదాలు టాలీవుడ్ మరవకముందే కొత్త సంవత్సరంలో కూడా మరిన్ని విషాదాలు వరుసగా వస్తున్నాయి.............

Kaburulu

Kaburulu Desk

January 6, 2023 | 03:59 PM

Sunil Babu : టాలీవుడ్ లో వరుస విషాదాలు.. సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ కన్నుమూత..

Sunil Babu :  గత సంవత్సరం నుంచి టాలీవుడ్ లో వరుసగా పలువురు ప్రముఖులు మరణిస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో వరుస విషాదాలు ఏర్పడ్డాయి. ఆ విషాదాలు టాలీవుడ్ మరవకముందే కొత్త సంవత్సరంలో కూడా మరిన్ని విషాదాలు వరుసగా వస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ప్రముఖ గేయ రచయిత పెద్దాడ మూర్తి మరణించగా తాజాగా ప్రముఖ సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు మరణించారు.

మలయాళ పరిశ్రమకి చెందిన సునీల్ బాబు సినీ పరిశ్రమలోకి ఆర్ట్ డిపార్ట్మెంట్ లో సెట్ బాయ్ గా చేరి పలు సినిమాలకి సెట్ డిపార్ట్మెంట్ లో పనిచేసి అనంతరం సీనియర్ కళాదర్శకుడు సాబుసిరిల్ వద్ద శిష్యుడిగా పనిచేసి ఎంతో కష్టపడి సొంతంగా ఆర్ట్ డైరెక్టర్ గా ఎదిగారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో ఎన్నో సినిమాలకి ఆయన ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. స్టార్ హీరోల సినిమాలకి కూడా ఆయన పనిచేశారు. గజిని, లక్ష్యం, ఎంఎస్ ధోని, సీతారామం, వారసుడు.. లాంటి పలు స్టార్ సినిమాలకి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేశారు సునీల్ బాబు. మలయాళంలో కూడా స్టార్ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇటీవలే ఆయన వారసుడు సినిమాకి పనిచేశారు. ఆ సినిమా రిలీజ్ అవ్వకుండానే కన్నుమూశారు.

KTR-Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో కేటీఆర్.. బిజినెస్, బిర్యానీలపై చర్చ

సునీల్ బాబుకి 50 ఏళ్ళ వయసులో హఠాత్తుగా గుండెపోటు రావడంతో చికిత్స తీసుకుంటూ కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో మరణించారు. దీంతో సునీల్ బాబుకి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇటీవల మంచి విజయం సాధించిన సీతారామన్ సినిమాకి కూడా ఈయనే ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. దీంతో ఆ చిత్ర యూనిట్ ఈయనకి సంతాపం తెలియచేస్తూ ఓ వీడియోని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.