Brahmastra : బాయ్‌కాట్ లేదు.. ఏం లేదు.. సినిమా బాగుంటే వస్తారు.. రణబీర్ వ్యాఖ్యలు..

Brahmastra : ఇటీవల బాలీవుడ్ లో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాయ్‌కాట్ దెబ్బకి బాలీవుడ్ బెంబేలెత్తిపోతోంది. సినిమాలని, స్టార్లని వరుసపెట్టి బాయ్‌కాట్ అంటున్నారు. ఏ సినిమా వచ్చినా ఫ్లాపవుతుంది. ఈ బాయ్‌కాట్ పై ఎవరైనా సీరియస్ గా మాట్లాడినా వాళ్ళని కూడా బాయ్‌కాట్ అంటున్నారు నెటిజన్లు. త్వరలో బాలీవుడ్ నుంచి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా రానుంది.
సెప్టెంబర్ 9న పాన్ ఇండియా రేంజ్ లో బ్రహ్మాస్త్ర సినిమా రిలీజ్ కాబోతుంది. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది. ఈ నేపథ్యంలో బ్రహ్మాస్త్రకి కూడా బాయ్‌కాట్ సెగ తగిలింది. ఇప్పటికే ట్విట్టర్ లో బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర ట్రెండింగ్ లో ఉంది. దీనిపై గతంలో అలియా భట్ మాట్లాడుతూ.. సినిమా చూడాలనిపిస్తే చూడండి. లేకపోతే మానేయండి అనడంతో నెటిజన్లు మరింత రెచ్చిపోయి బాయ్‌కాట్ బ్రహ్మాస్త్రని రోజూ ట్రెండ్ చేస్తున్నారు.
తాజాగా ఈ బాయ్‌కాట్ ట్రెండ్ పై హీరో రణబీర్ వ్యాఖ్యలు చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో రణబీర్ బాయ్‌కాట్ ట్రెండ్ పై మాట్లాడుతూ.. బాయ్‌కాట్ లాంటిది ఏమి లేదు. సినిమా కంటెంట్ బాగుంటే అందరూ వస్తారు. ఇటీవల రిలీజైన నా షంషేరా సినిమాకి బాయ్‌కాట్ వల్ల నష్టం కలగలేదు. కంటెంట్ బాగోలేక సినిమాని ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు” అని అన్నాడు. దీంతో రణబీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.