Alia Bhatt : సినిమాలో పాజిటివ్ అంశాలని చూడండి.. బ్రహ్మాస్త్ర బాగా ఆడుతుంది..

Kaburulu

Kaburulu Desk

September 17, 2022 | 12:50 PM

Alia Bhatt : సినిమాలో పాజిటివ్ అంశాలని చూడండి.. బ్రహ్మాస్త్ర బాగా ఆడుతుంది..

Alia Bhatt : అలియా భట్- రణబీర్ కపూర్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా మంచి విజయం సాధించింది. సినిమా కథ, కథనంపై విమర్శలు వస్తున్నా విజువల్స్, గ్రాఫిక్స్ కోసం ప్రేక్షకులు సినిమా చూడటానికి వస్తున్నారు. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. బ్రహ్మాస్త్ర సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ 100 కోట్ల గ్రాస్ క్రాస్ చేసింది.

ఈ సినిమా విజువల్స్, గ్రాఫిక్స్ విషయంలో పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నా కొన్ని విషయాల్లో మాత్రం ట్రోలింగ్ తప్పట్లేదు. ముఖ్యంగా అలియా భట్ క్యారెక్టర్, ఆమె పాత్ర నిడివి పై చాలా విమర్శలు వస్తున్నాయి. నెటిజన్లు దారుణంగా ఆమె పాత్రని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా బ్రహ్మాస్త్ర సక్సెస్ మీట్ లో విలేఖరులు ఇదే అంశాన్ని అలియాభట్ వద్ద ప్రస్తావించారు.

Ye Maya Chesave 2: చైతన్యతో ‘ఏ మాయ చేసావే 2’ చేస్తానంటున్న గౌతమ్ మీనన్.. మరి సమంత సంగతేంటి?

అలియాభట్ దీనికి సమాధానమిస్తూ.. ”మనం పాజిటివ్ అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. సినిమా బాగా ఆడుతుంది. మనం చూసే దానిబట్టే సినిమా ఉంటుంది. ప్రేక్షకుల నుంచి వచ్చే విమర్శలని నేను గౌరవిస్తాను. కానీ సినిమాలో చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టండి.” అని తెలిపింది. గతంలో ఇలాంటి ప్రశ్నలకి సీరియస్ గా సమాధానం ఇచ్చిన అలియా బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర అన్న తర్వాత నుంచి జాగ్రత్తగా మాట్లాడుతుంది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఇలా అదే జాగ్రత్తతో మాట్లాడుతుంది.