Kiran Abbavaram : నేను మీకు బాగా కావాల్సిన వాడిని ట్రైలర్ రిలీజ్.. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్..

Kaburulu

Kaburulu Desk

September 8, 2022 | 01:20 PM

Kiran Abbavaram : నేను మీకు బాగా కావాల్సిన వాడిని ట్రైలర్ రిలీజ్.. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్..

Kiran Abbavaram :  యువ హీరో కిరణ్ అబ్బవరం తన సినిమాల ఫలితం ఎలా ఉన్నా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. గత రెండు సినిమాలు ప్రయోగం, మాములు లవ్ స్టోరీ సినిమాలు అవ్వడంతో ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. త్వరలో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ కానుంది. దివంగత ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తాజాగా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే.. ఒక క్లాస్ అమ్మాయి, ఒక మాస్ అబ్బాయిని ప్రేమిస్తే, ఆ అమ్మాయికి ఏదో బ్యాక్ స్టోరీ ఉంటే అన్నట్టు కమర్షియల్ కోణంలో లవ్ స్టోరీని మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇందులో బాబా మాస్టర్, sv కృష్ణారెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. కిరణ్ అబ్బవరం ఇప్పటివరకు అన్ని క్లాస్ పాత్రలు చేయగా ఈ సినిమాతో పూర్తి మాస్ హీరోగా మారడానికి ప్రయత్నిస్తున్నాడు.

మరి ఈ సినిమాతో అయినా కిరణ్ అబ్బవరం మాస్ హిట్ కొట్టి మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.