Viral Video: పర్యాటకులను కిలోమీటరు దూరం వెంబడించి ముచ్చెమటలు పట్టించిన ఖడ్గమృగం!

Viral Video: మనుషులకంటే నగరాల్లో, గ్రామాల్లో ఇళ్ళు ఉన్నాయి. కానీ, అడవిలో ఉండే అనేక జంతువులకు ఇల్లు ఒక్కటే.. అదే అడవి. మరి ఆ అడవిలో అవి చక్కగా జీవిస్తుంటే మనుషులు వెళ్లి డిస్టర్బ్ చేయవచ్చా? అందుకే ఒక్కోసారి అవి తిక్క లేస్తే తరుముతాయి. వాటి జోలికి వెళ్తున్నట్లు వాటికి అనిపిస్తే ఖచ్చితంగా తరుముతాయి. గతంలో ఇలాంటి ఘటనలు అనేకం చూసాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. దాని వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
దక్షిణాఫ్రికాలోని గ్రేటర్ క్రుగర్ నేషనల్ పార్క్‌లో జరిగిందీ ఘటన. అనాస్టేసియా చాప్‌మన్ తన స్నేహితులతో కలిసి సఫారీ జీప్‌లో విహరిస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కన గడ్డి మేస్తున్న ఖడ్గమృగం జీపు శబ్దానికి అటువైపు చూసి కోపంతో ఒక్కసారిగా జీపును వెంబడించింది. దీంతో జీపులోని చాప్‌మన్ ఆమె స్నేహితులు భయంతో వణికిపోయారు. దానికి చిక్కితే ఏమవుతుందోనని భయపడిపోయారు. దారి బురదగా ఉన్నప్పటికీ వెనక ఖడ్గమృగం వెంబడిస్తుండడంతో జీపు డ్రైవర్ మరింత వేగం పెంచాడు.
ఇది చాలా భయంకరమైన అనుభవమని చాప్‌మన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. మూడు నాలుగు నిమిషాలపాటు కిలోమీటరు దూరం తమను అది భయంకరంగా వెంబడించిందని పేర్కొన్నారు. అయితే, తమ డ్రైవర్ వీలైనంత వేగంగా వాహనాన్ని డ్రైవ్ చేయడంతో తాము సురక్షితంగా బయటపడగలిగామని అన్నారు. వైరల్ అయిన ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకయ్యారు.
‘ఖడ్గమృగాలు చాలా నెమ్మదిగా కదులుతాయని, వాటి బరువు కారణంగా సులభంగా అలసిపోతాయని అనుకునేవాడని. కానీ ఈ వీడియో చూశాక నా నమ్మకం కరెక్ట్ కాదని అనిపించింది. సింహాల కంటే ఖడ్గమృగాల వల్లే ఎక్కువ మంది మరణిస్తున్నారన్న గణాంకాలు చదివినప్పుడు నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తోంది’ అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.
View this post on Instagram
Up for sale is a vintage, antique Bufco Blacksmith Blower made by Buffalo Forge embed Instagram code in Buffalo, NY. The blower has been used, the handle does turn.