Satya Yamini : కాబోయే భర్తని పరిచయం చేసిన టాలీవుడ్ సింగర్..

Kaburulu

Kaburulu Desk

December 4, 2022 | 03:26 PM

Satya Yamini : కాబోయే భర్తని పరిచయం చేసిన టాలీవుడ్ సింగర్..

Satya Yamini :  తెలుగులో పాడుతా తీయగా, స్వరాభిషేకం లాంటి ప్రోగ్రామ్స్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన సింగర్ సత్య యామిని. బాహుబలి సినిమాలో మమతల తల్లి పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయిపొయింది. బాహుబలి సినిమా తర్వాత సత్య యామినికి వరుస అవకాశాలు వచ్చాయి. ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘కొండపొలం’, ‘రాధేశ్యామ్‌’, ‘అఖండ’, ‘బింబిసార’, ‘అహింస’.. లాంటి పలు సినిమాల్లో పాటలు పాడింది.

Haripriya-Vasishta : నిశ్చితార్థం చేసుకున్న హీరో, హీరోయిన్స్..

ఇక తన యూట్యూబ్ ఛానల్ లో కూడా పాటలు, కవర్ సాంగ్స్ తో అలరిస్తుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉండే ఈ గాయని తాజాగా తనకి కాబోయే భర్తని పరిచయం చేసింది. ఈ మేరకు తనకి కాబోయే భర్తతో ఫోటో దిగి ఆ ఫొటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. జీవితకాలం ప్రయాణం వేచి ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ప్రకటించింది. దీంతో పలువురు సింగర్స్, ప్రముఖులు ఆమెకి కంగ్రాట్స్ చెప్తున్నారు.