Kobbari Puvvu : ఇష్టంగా తినే కొబ్బరిపువ్వు.. ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

Kaburulu

Kaburulu Desk

December 4, 2022 | 03:52 PM

Kobbari Puvvu : ఇష్టంగా తినే కొబ్బరిపువ్వు.. ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

Kobbari Puvvu :  ఆరోగ్యం కోసం ఎండాకాలం రాగానే కొబ్బరినీళ్లు తాగుతాం. ఇప్పుడు మామూలు రోజుల్లో కూడా కొబ్బరి నీళ్లు తాగుతున్నాం. కొన్ని కొబ్బరికాయల్లో కొబ్బరి పువ్వు వస్తుంది. సాధారణంగా పూజల్లో కొట్టిన కొబ్బరికాయల్లో కొబ్బరి పువ్వు వస్తే చాలా మంచిది అని చెప్తారు. ఆ కొబ్బరు పువ్వుని తింటారు కూడా. చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఇష్టంగా ఆ కొబ్బరిపువ్వుని తింటారు.

కొబ్బరిపువ్వు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొబ్బరిపువ్వును ఎవరైనా తినవచ్చు. ఇది సీజనల్ ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. క్లైమేట్ చేంజ్ అయినపుడు వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటివి రాకుండా ఉండేలా చేస్తుంది. కొబ్బరిపువ్వును రోజూ తింటే చాలా మంచిది. కానీ అది అంతా ఈజీగా దొరకదు. అందుకే దొరికినప్పుడు మాత్రం కొబ్బరిపువ్వుని వదిలిపెట్టకుండా తినండి.

* కొబ్బరిపువ్వులో ఉండే పోషకాలు మనలోని రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
* మనం ఆహరం తినలేకపోతే ఆ సమయంలో కొబ్బరిపువ్వును తింటే మనకు శక్తి లభిస్తుంది.
* కొబ్బరిపువ్వును తింటే మన రక్తంలోని చెడు కొవ్వును తొలగించి మంచి కొవ్వు మన శరీరానికి అందేలా చేస్తుంది.
* కొబ్బరిపువ్వు మన శరీరంలోని కిడ్నీలు పాడవకుండా ఉండడానికి, కిడ్నీ ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.
* కొబ్బరిపువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ మన చర్మం యవ్వనంగా ఉండేలా, చర్మంపై ముడతలు తొందరగా రాకుండా ఉండేలా చేస్తుంది.
* కొబ్బరిపువ్వు మన శరీరంలోని థైరాయిడ్ స్రావాన్ని నియంత్రించి థైరాయిడ్ సమస్యలను నియంత్రిస్తుంది.
* కొబ్బరిపువ్వులో ఉండే రాగి, ఇనుము, జింక్ మన శరీరంలో ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచుతాయి.
* మలబద్దకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.

Also Read……………… Sesame : నువ్వులు తినడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా??

మనం ఇష్టంగా తినే కొబ్బరిపువ్వు వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే ఇంక అస్సలు వదిలిపెట్టం కదా.