Haripriya-Vasishta : నిశ్చితార్థం చేసుకున్న హీరో, హీరోయిన్స్..

Kaburulu

Kaburulu Desk

December 4, 2022 | 03:11 PM

Haripriya-Vasishta : నిశ్చితార్థం చేసుకున్న హీరో, హీరోయిన్స్..

Haripriya-Vasishta :  ఇటీవల సినీ పరిశ్రమలో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. సినిమా వాళ్ళు ఎక్కువగా సినిమా వాళ్లనే చేసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితమే తమిళ హీరో, హీరోయిన్స్ మంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్ పెళ్లి చేసుకోగా తాజాగా మరో హీరో, హీరోయిన్ జంట పెళ్లి పీటలెక్కబోతుంది.

తెలుగులో పిల్ల జమిందార్ సినిమాతో పలకరించిన హరిప్రియ కన్నడలో వరుసగా సినిమాలు చేస్తుంది. కన్నడ నటుడు వసిష్ఠ సింహ హీరోగానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను పలు కన్నడ సినిమాల్లో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించారు. అప్పట్నుంచి వీరి స్నేహం మొదలై అనంతరం ప్రేమగా మారింది. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Pawan Klayan : సూపర్ కాంబో.. RRR నిర్మాత.. సాహో దర్శకుడితో.. పవర్ స్టార్ సినిమా..

తాజాగా ఈ జంట తమ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నిశ్చితార్థం చేసుకున్నట్టు తెలిపారు. శనివారం నాడు ఇరు కుటుంబ సభ్యుల మధ్య సింపుల్ గా హరిప్రియ, వసిష్ఠల నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.