Nayani Pavani : ప్రముఖ యూట్యూబర్ తండ్రి మరణం.. నాన్న నిన్ను చూడాలనుకుంటున్నాను అని ఎమోషనల్ పోస్ట్..

ఇటీవల డిసెంబర్ 31 న నయని పావని తండ్రి మరణించారు. తన తండ్రి పార్థివదేహం వద్ద ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్న ఫొటోని తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసి...........

Kaburulu

Kaburulu Desk

January 3, 2023 | 12:15 PM

Nayani Pavani : ప్రముఖ యూట్యూబర్ తండ్రి మరణం.. నాన్న నిన్ను చూడాలనుకుంటున్నాను అని ఎమోషనల్ పోస్ట్..

Nayani Pavani :  కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, రీల్స్ తో బాగా పేరు తెచ్చుకుంది నయని పావని. యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో తనకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల గత సీజన్ ఢీ షోలో కూడా కంటెస్టెంట్స్ తరపున లీడర్ గా ఉండి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి పలు టీవీ షోలలో కూడా మెల్లి మెల్లిగా అవకాశాలు తెచ్చుకుంటుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా అవకాశాలు తెచ్చుకుంటుంది నయని పావని. మరో యూట్యూబర్ శ్వేతా నాయిడుతో కలిసి డ్యాన్సులు వేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది.

Manushi Chiller : రాజమౌళి సినిమాలో ఛాన్స్ కావాలంటున్న మాజీ మిస్ వరల్డ్..

అయితే ఇటీవల డిసెంబర్ 31 న నయని పావని తండ్రి మరణించారు. తన తండ్రి పార్థివదేహం వద్ద ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్న ఫొటోని తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నాన్న మిమ్మల్ని మళ్ళీ చూడాలనుకుంటున్నాను, నా బాధని ఎవరూ దూరం చేయలేరు అంటూ నయని పావని ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. అలాగే ఏడుస్తూ తన కుక్క పిల్లని పట్టుకొని ఉన్న వీడియోల్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో పలువురు ప్రముఖులు, యూట్యూబర్స్ ఆమెకి సానుభూతి తెలియచేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.