Unstoppable : సంక్రాంతికి అన్‌స్టాపబుల్ లో వీరసింహ రెడ్డి స్పెషల్ ఎపిసోడ్.. ఆ తర్వాతే పవన్ ఎపిసోడ్..

ఆహా అందరి అంచనాలని తలకిందులు చేస్తూ అన్‌స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్స్ ని అనౌన్స్ చేసింది. ఎనిమిదో ఎపిసోడ్ గా ప్రభాస్, గోపీచంద్ షో జనవరి 6న టెలికాస్ట్ అయిన తర్వాత తొమ్మిదో ఎపిసోడ్ గా జనవరి 13న........

Kaburulu

Kaburulu Desk

January 3, 2023 | 12:42 PM

Unstoppable : సంక్రాంతికి అన్‌స్టాపబుల్ లో వీరసింహ రెడ్డి స్పెషల్ ఎపిసోడ్.. ఆ తర్వాతే పవన్ ఎపిసోడ్..

Unstoppable :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో అన్‌స్టాపబుల్ షో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో భారీగా సక్సెస్ అయింది. సీజన్ 2లో ఇప్పటికే ఏడు ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. ఏడో ఎపిసోడ్ లో ప్రభాస్ గెస్ట్ గా వచ్చి అన్‌స్టాపబుల్ రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్లాడు. ఇక ఎనిమిదో ఎపిసోడ్ కూడా ప్రభాస్ తోనే ఉండబోతుంది. ఎనిమిదో ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా అలరించనున్నాడు. ఈ ఎపిసోడ్ ని జనవరి 6న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఇప్పటికే అన్‌స్టాపబుల్ లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా షూటింగ్ అయిపోవడంతో ఆ ఎపిసోడ్ కోసం మరింత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు, ప్రేక్షకులు. ఈ ఎపిసోడ్ షూటింగ్ సమయంలోనే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హంగామా చేశారు స్టూడియో వద్ద. ప్రభాస్ ఎపిసోడ్ తర్వాత ఈ ఎపిసోడ్ వస్తుంది అనుకున్నారు, లేదా సంక్రాంతికి ఈ ఎపిసోడ్ ని స్ట్రీమ్ చేస్తారు అనుకున్నారు అంతా.

అయితే ఆహా అందరి అంచనాలని తలకిందులు చేస్తూ అన్‌స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్స్ ని అనౌన్స్ చేసింది. ఎనిమిదో ఎపిసోడ్ గా ప్రభాస్, గోపీచంద్ షో జనవరి 6న టెలికాస్ట్ అయిన తర్వాత తొమ్మిదో ఎపిసోడ్ గా జనవరి 13న వీరసింహ రెడ్డి చిత్ర యూనిట్ రానున్నట్టు ప్రకటించారు. బాలకృష్ణ నటించిన వీరసింహ రెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్‌స్టాపబుల్ షోకి వీరసింహ రెడ్డి చిత్ర యూనిట్ రానున్నారు.

Nayani Pavani : ప్రముఖ యూట్యూబర్ తండ్రి మరణం.. నాన్న నిన్ను చూడాలనుకుంటున్నాను అని ఎమోషనల్ పోస్ట్..

అనంతరం పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఉందనున్నట్టు ప్రకటించారు. అన్‌స్టాపబుల్ సీజన్ 1ని పది ఎపిసోడ్స్ తో ముగించారు. ఆ సీజన్ లో లాస్ట్ ఎపిసోడ్ గా పదో ఎపిసోడ్ కి మహేష్ బాబుని తీసుకొచ్చి గ్రాండ్ గా చేశారు. దీంతో సీజన్ 2ని కూడా పది ఎపిసోడ్స్ తో ఎండ్ చేస్తారేమో, పదో ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేసి గ్రాండ్ గా సీజన్ ని ముగిస్తారేమో అని అభిమానులు, ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి భారీ అంచనాలున్న పవన్-బాలయ్య ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో చూడాలి.