IT Sector: ఐటీలో తనిఖీలు.. ఉద్యోగులలో టెన్షన్.. ఈ ఏడాది శాలరీల హైక్ కూడా లేనట్లే!

Kaburulu

Kaburulu Desk

February 8, 2023 | 08:59 AM

IT Sector: ఐటీలో తనిఖీలు.. ఉద్యోగులలో టెన్షన్.. ఈ ఏడాది శాలరీల హైక్ కూడా లేనట్లే!

IT Sector: ఓ వైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు విపత్కర పరిస్థితులు.. ఈ కారణంగానే ప్రపంచ దిగ్గజ సంస్థలన్నీ లేఆఫ్ బాట పడుతున్నాయి. ఇదే ఇప్పుడు ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర కలవరానికి గురిస్తోంది. గూగుల్ లాంటి దిగ్గజ సంస్థల నుంచి చిన్న చిన్న కంపెనీలు సైతం ఈ లే ఆఫ్ బాటలో వెళ్తున్నాయి. జూమ్ కంపెనీ 1300 మందిని ఇంటికి పంపేందుకు సిద్ధమైందని తాజాగా ఐటీ సెక్టార్ లో చక్కర్లు కొడుతుండడం ఐటీ ఉద్యోగులలో ఆందోళన కలిగిస్తుంది.

రాత్రికిరాత్రే ఉద్యోగులను తొలగిస్తుండటం ఐటీ సిబ్బందిలో ఆందోళనలకు దారితీస్తుంది. అసలు ఏం జరుగుతుందో కూడా రిక్రూటర్స్‌కే అర్ధం కావడం లేదని వార్తలు వస్తున్నాయి. ప్రాజెక్ట్ లేదని.. కాస్ట్ కటింగ్ పాలసీ అని, లే అఫ్ పాలసీ అని ఇలా రకరకాలుగా ఉన్నపళంగా ఉద్యోగం నుండి పీకిపారేస్తున్నారు. దీంతో ఉద్యోగులు వారంలోనే జీతం జీతం పెంచుతామన్నారు.. అంతలోనే జాతకం మార్చేశారంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.

ఒకవైపు జీతాల కోత, మరోవైపు కొత్త నియామకాల నిలిపివేత ఈ నేపథ్యంలో ప్రతిసంస్థ ఉద్యోగుల ఎక్స్ పీరియన్స్, కేపబిలిటీలను నిశితంగా గమనిస్తున్నాయి. కొవిడ్ పరిణామాల సమయంలో అధిక వేతనాలు ఇచ్చి నియమించుకున్న సీనియర్ ఉద్యోగులను అయితే.. వంకలు వెతికి మరీ ఇంటికి పంపిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న నేపథ్యంలో ఐటీ కంపెనీల మార్జిన్లు తగ్గుతున్నాయి. దీంతో కంపెనీలు వ్యయాల నియంత్రణ మొదలు పెట్టగా.. ఈ ఏడాది శాలరీలు హైక్ కూడా లేనట్లేనని చెప్తున్నారు.

కొవిడ్ సమయంలో కూడా ఎంతో ఆశాజనకంగా కనిపించిన రంగాలలో ఐటీ ఒకటి. అయితే ఆర్థిక మందగమన భయాలతో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. అధిక వేతనాల సీనియర్ ఉద్యోగులు, పర్ఫామెన్స్ బాలేని కొత్త ఉద్యోగులనూ ఇంటికి పంపిస్తున్నారు. ఇన్ఫోసిస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ సహా ఐటీ కంపెనీలు దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపించగా ఇది ఇంకా కొనసాగే వీలుందని చెప్తున్నారు. అదే సమయంలో పర్ఫామెన్స్ బావున్నా ఈ ఏడాది హైక్ కూడా లేనట్లేనని చెప్తున్నారు.