Lulonga River: ఘోర పడవ ప్రమాదం.. 145 మంది జలసమాధి

Lulonga River: మొత్తం 200 మంది ప్రయాణీకులతో కూడిన పడవ పొరుగున ఉన్న రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు వెళుతుండగా లులోంగా నదిలో మునిగిపోయింది. 145 మంది ఆచూకీ తెలియకపోగా ఇప్పుడు చనిపోయినట్లు భావిస్తున్నారు. అందులో 55 మంది విపత్తు నుండి బయటపడ్డారని అధికారులు తెలిపగా మిగతా వాళ్ళు చనిపోయినట్లు చెప్తున్నారు. వాయువ్య డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో [DRC]లోని ఒక నదిపై రాత్రిపూట సరుకులు, జంతువులతో ఓవర్‌లోడ్ చేయబడిన మోటరైజ్డ్ పడవ మునిగిపోవడంతో కనీసం 145 మంది ప్రయాణికులు తప్పిపోయి చనిపోయారని అధికారులు తెలిపారు.
ఈ విపత్తు నుంచి 55 మంది ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు గురువారం తెలిపారు. ఈ పడవ పొరుగున ఉన్న రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు వెళుతుండగా మంగళవారం అర్థరాత్రి బసంకుసు పట్టణానికి సమీపంలో లులోంగా నదిలో బోల్తా పడింది. మొదట కనీసం 145 మంది తప్పిపోయారని ఆ ప్రాంతంలోని సివిల్ సొసైటీ గ్రూపుల అధ్యక్షుడు జీన్-పియరీ వాంగేలా విలేకరులతో అన్నారు.. ఆ తర్వాత చనిపోయారని ప్రకటించారు. పడవ బోల్తాకు ఓవర్‌లోడ్ కారణమని అతను చెప్పాడు.
అయితే స్థానికులకు కొన్ని ఇతర విషయాలు కూడా ఉన్నాయని చెప్పారు. బోటులో దాదాపు 200 మంది ఉన్నారని కొన్ని ఏజెన్సీలు తెలుపుతున్నాయి. కాంగో వెళ్తుండగా బసన్ కును పట్టణం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగి మూడు రోజులు కావస్తున్నా.. ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి ప్రపంచానికి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందంటే అది ఎంత మారుమూల దేశమో అర్ధం చేసుకోవచ్చు.
డజన్ల కొద్దీ మరణాలకు కారణమయ్యే పడవలు మునిగిపోవడం DRC యొక్క మారుమూల ప్రాంతాల్లో సర్వసాధారణం కాగా ఇక్కడ కొన్నిసార్లు రోడ్డు మార్గంలో ప్రయాణం అసాధ్యం కావడంతో అంతా బోట్ల ప్రయాణానికి మొగ్గుచూపుతారు. ఆఫ్రికన్ దేశంలోని మారుమూల ప్రాంతాల్లో రెస్క్యూ కార్యకలాపాలు చాలా పరిమితంగా ఉండగా.. అక్టోబర్‌లో, ఈక్వెటూర్ ప్రావిన్స్‌లోని కాంగో నదిపై 40 మందికి పైగా ఇలాంటి పరిస్థితులలో మరణించారు. ఇప్పుడు ఇలా 145 మంది జలసమాధి అవడం విషాదం.