Rajamouli : రాజమౌళి పై డాక్యుమెంట్ తీస్తున్న బాలీవుడ్..

తాజాగా దర్శకధీరుడు రాజమౌళి పై ఓ డాక్యుమెంటరీ ప్రకటించారు. బాలీవుడ్ కి చెందిన అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫిల్మ్‌ కంపానియన్‌ సంస్థలు కలిసి ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ అనే ఓ డాక్యుమెంటరీ సిరీస్ ని ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా భారతదేశ....................

Kaburulu

Kaburulu Desk

January 20, 2023 | 02:27 PM

Rajamouli : రాజమౌళి పై డాక్యుమెంట్ తీస్తున్న బాలీవుడ్..

Rajamouli :  బాహుబలి, RRR సినిమాలతో రాజమౌళి దేశంలోనే కాదు ఏకంగా ప్రపంచమంతటా పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. RRR సినిమాతో రాజమౌళి పేరు ప్రపంచ సినీ పరిశ్రమలో మారుమ్రోగుతుంది. హాలీవుడ్ లో అయితే రాజమౌళికి అభిమానులు భారీగా ఏర్పడ్డారు. RRR సినిమాతో హాలీవుడ్ లో పలు అవార్డులు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఆస్కార్ టార్గెట్ గా RRR సినిమాని ప్రమోట్ చేస్తూ అమెరికాలోనే మకాం వేశారు రాజమౌళి.

తాజాగా దర్శకధీరుడు రాజమౌళి పై ఓ డాక్యుమెంటరీ ప్రకటించారు. బాలీవుడ్ కి చెందిన అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫిల్మ్‌ కంపానియన్‌ సంస్థలు కలిసి ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ అనే ఓ డాక్యుమెంటరీ సిరీస్ ని ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా భారతదేశ సినీ పరిశ్రమలోని గొప్ప గొప్ప టెక్నీషియన్స్ యొక్క వర్కింగ్ స్టైల్, లైఫ్ స్టైల్, వాళ్ళ ట్రావెల్, కెరీర్, సినీ ప్రయాణం.. ఇలా అన్ని అంశాలతో వారిపై ఒక డాక్యుమెంటరీని తీయనున్నారు.

ఈ డాక్యుమెంటరీ సిరీస్ లో భాగంగా మొదట మన రాజమౌళి ఎపిసోడ్ తీస్తుండటం విశేషం. తెలుగు సినిమాని దేశ హద్దులు దాటి ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి ప్రస్తుతం వరల్డ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచారు. ఆలాగే గత కొన్ని రోజులుగా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నారు రాజమౌళి. దీంతో ఈ బాలీవుడ్ సంస్థలు తమ ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ సిరీస్ ని డైరెక్టర్ రాజమౌళి తో మొదలుపెట్టనున్నారు.

Pushpa 2 shooting : పుష్ప 2 షూటింగ్ చూడాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..

ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి టేకింగ్, మేకింగ్, లైఫ్ స్టైల్, సినిమా ప్రయాణం, ఆయనతో ఇంటర్వ్యూ.. అన్నీ చూపించనున్నారు. రాజమౌళి ఈ డాక్యుమెంటరీ కోసం కొన్ని స్పెషల్ విజువల్స్ లో నటించారు కూడా. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీ షూటింగ్ పూర్తయింది. తాజాగా దీనికి సంబంధించిన ఓ చిన్న ప్రోమోని విడుదల చేసి ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ ఫస్ట్ ఎపిసోడ్ రాజమౌళి అంటూ ప్రమోట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ డాక్యుమెంటరీ విడుదల చేయనున్నారు. దీంతో రాజమౌళి అభిమానులతో పాటు, సినీ ప్రేమికులంతా ఈ డాక్యుమెంటరీ కోసం ఎదురు చూస్తున్నారు.