Bank Holidays in May: 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. పని ఉంటే ముందే జాగ్రత్త పడండి!

Kaburulu

Kaburulu Desk

March 25, 2023 | 11:00 PM

Bank Holidays in May: 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. పని ఉంటే ముందే జాగ్రత్త పడండి!

Bank Holidays in May: మార్చి చివరి వారం వచ్చేసింది. నూత‌న ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభం కావ‌డానికి మ‌రో ఐదు రోజుల టైం మాత్ర‌మే మిగిలి ఉంది. ఆర్ధిక సంవత్సరం ముగింపు కావడంతో బ్యాంకులతో ఎక్కువ అవసరం ఉంటుంది. వ్యాపార లావాదేవీలు, ఉద్యోగస్తులు, డిపాజిట్ దారులు ఇలా ఈ నెలలో వీరికి ఎక్కువ అవసరం ఉంటుంది. అందుకే చాలా మంది సాధారణ ప్రజలు ఈ నెలలో పనులు ఉన్నా.. వచ్చే నెలకి వాయిదా వేసుకుంటుంటారు. అలాంటి ఆలోచన ఉన్న వారు ఇది చదవాల్సిందే.

ఎందుకంటే.. ఏప్రిల్ నెల తొలి రెండు రోజులు సెల‌వుల‌తోనే ప్రారంభం అవుతుంది. ఐదు ఆదివారాలు, రెండో-నాలుగో శ‌నివారంతోపాటు పబ్లిక్ హాలీడేలు, వివిధ రాష్ట్రాల్లో పండగలు ఇలా దేశ‌వ్యాప్తంగా 15 రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు ఉన్నాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు ప‌ని చేయ‌వు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఆయా సెలవు రోజుల్లో మూసి ఉంటాయి. అలాగే వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ సెలవుల్లోనూ ఆ ప్రాంతాల్లో బ్యాంకులు మూతపడతాయి.

ఏప్రిల్ నెలలో సెలవుల వివరాలు చూస్తే..
ఏప్రిల్ 1: కొత్త ఆర్థికసంవత్సరం తొలి రోజు ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 2, 9, 16, 23, 30, ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు
మహావీర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 4న వివిధ నగరాల్లో బ్యాంకులు మూత
ఏప్రిల్ 5 బాబూ జగ్‌జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 7న గుడ్ ఫ్రైడే కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 8 రెండో శనివారం, 22 నాలుగో శనివారం కావడంతో ఆ రోజుల్లో బ్యాంకులు ఉండవు
ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 15న వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పండగలు ఉండగా ఆయా ప్రాంతాల్లో సెలవులు
షాబ్ ఇ బకర్ కారణంగా ఏప్రిల్ 18న జుమ్మూ-శ్రీనగర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి
ఈద్ ఉల్ ఫితర్‌తో ఏప్రిల్ 21న అగర్తల, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులు క్లోజ్ ఉండనున్నాయి.