Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మంది మృతి.. పదుల సంఖ్యలో గాయాలు

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 09:04 AM

Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మంది మృతి.. పదుల సంఖ్యలో గాయాలు

Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. పెరూ రాజధాని లిమాలో జరిగిన ఈ ఘటనలో 25 మంది మరణించగా.. అనేక మంది గాయపడినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని వెల్లడించారు. పెరూ కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిందీ ఘటన.

మొత్తం 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పెరూలో కొండపై నుంచి లోయలో పడిపోవడంతో 24 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. బస్సు లోయలో పడేప్పుడు పలువురు ప్రయాణికులు బస్సులో నుంచిబయటపడగా.. మరికొందరు బస్సులో చిక్కుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు.

పెరూ నుంచి వెళ్తున్న ఓ బస్సు ఈక్వెడార్ సరిహద్దు సమీపంలోని టుంబేస్ ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కోరియాంకా టూర్స్ కంపెనీకి చెందిన బస్సు, లిమా నుంచి బయలుదేరి ఈక్వెడార్ సరిహద్దులోని టుంబేస్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డెవిల్స్ కర్వ్ అని పిలువబడే ప్రదేశంలో ప్రమాదం జరిగిందని సంఘటనా స్థలంలో ఉన్న పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. గాయపడిన ప్రయాణికులను ఎల్ఆల్టో, ల్టోమాన్‌కోరాలోని ఆసుపత్రులకు తరలించారు.

కొందరు ప్రయాణికులు హైతీకి చెందిన వారని పోలీసులు తెలిపారు. పెరూలో హైతీ వలసదారుల సంఖ్య పెరుగుతోంది. అయితే బస్సులో ఉన్న వారి పరిస్థితి ఇంకా తెలియరాలేదు. కాగా, పెరూలో రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల అజాగ్రత్త, అతివేగమే కారణాలని పెరూ ప్రాసిక్యూటర్ కార్యాలయం పేర్కొంది. ఘటనాస్థలికి రెస్క్యూ సిబ్బంది చేరుకోవడం ఆలస్యం అవుతుందని.. అంతలోపే రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు ప్రాణాలు పోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.