Strange Baby: రెండు గుండెలు, నాలుగు కాళ్ళు, నాలుగు చేతులలో శిశువు జననం!

Strange Baby: వింత వింత ఆకారాలు, అవసరానికి మించి అవయవాలు, అవిభక్త కవలలు జన్మించడం చూశాం. అయితే.. రెండు గుండెలతో శిశువులు జన్మించడం మాత్రం చాలా అరుదు. రాజస్థాన్లోని చురూ జిల్లాలో అదే జరిగింది. రెండు గుండెలు, నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో శిశువు జన్మించింది. అయితే, శిశువు పుట్టిన ఇరవై నిమిషాలకే మరణించింది. రతన్గఢ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 19 ఏళ్ల గర్భిణి రెండు గుండెలు.. నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్న చిన్నారికి జన్మనిచ్చింది.
అయితే, పుట్టిన 20 నిమిషాలకే నవజాత శిశువు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. రాజల్దేసార్కు చెందిన హజారీ సింగ్ అనే మహిళ ప్రసవ వేదనతో ఆదివారం రాత్రి రతన్గఢ్లోని గంగారామ్ ఆసుపత్రిలో చేరగా.. ఆమెకు సోనోగ్రఫీ నిర్వహించగా అందులో వింత శిశువు కనిపించిందని వైద్యులు పేర్కొన్నారు. ఆస్పత్రిలో చేరిన గంట తర్వాత హజారీ సింగ్ కు నార్మల్ డెలివరీ చేసినట్లు వైద్యులు తెలిపారు.
పుట్టిన బిడ్డకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లతోపాటు రెండు గుండెలు, రెండు వెన్నెముకలు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అయితే, తల మాత్రం ఒకటే ఉందని, హృదయ స్పందనలు తక్కువగా ఉండడంతో పుట్టిన 20 నిమిషాలకే నవజాత శిశువు మృతి చెందినట్టు తెలిపారు. ఈ రకమైన డెలివరీని కంజుక్టివల్ అనోమలీ అంటారు. అయితే 20 నిమిషాలకే బిడ్డ చనిపోయిందని వైద్యులు తెలిపారు.
ఈ బిడ్డ ఇలా పుట్టడానికి క్రోమోజోమ్ల లోపం కావచ్చని వారు తెలిపారు. ఈ వింత పాపను చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి చాలా మంది జనం తరలివచ్చారు. గతంలో 2022 డిసెంబరులో ఇలాంటి వింత ఘటనే మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. గ్వాలియర్ జిల్లాలో ఓ పాప నాలుగు కాళ్లతో పుట్టగా బిడ్డ పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
चूरू के रतनगढ़ में जन्मा अजीब बालक, चार हाथ, चार पांव और एक सिर, बना चर्चा का विषय#Rajasthan https://t.co/VRS85MkP2y
— Rajasthan Tak (@Rajasthan_Tak) March 6, 2023