Susmita Sen : నాకు గుండెపోటు వచ్చింది.. ఆపరేషన్ జరిగింది.. షాక్ ఇచ్చిన మాజీ విశ్వ సుందరి..

మాజీ విశ్వ సుందరి, నటి సుస్మిత సేన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తన తండ్రితో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి.......

Kaburulu

Kaburulu Desk

March 2, 2023 | 08:31 PM

Susmita Sen : నాకు గుండెపోటు వచ్చింది.. ఆపరేషన్ జరిగింది.. షాక్ ఇచ్చిన మాజీ విశ్వ సుందరి..

Susmita Sen :  మాజీ విశ్వ సుందరి, నటి సుస్మిత సేన్ బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసింది. ఆ తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నా ఇటీవల మళ్ళీ వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రస్తుతం పలు సిరీస్ లు చేస్తూ బిజీగానే ఉంది. ఇటీవలే లలిత్ మోదీతో ప్రేమలో ఉన్నాను అని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది కూడా. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

తన తండ్రితో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి.. నీ హృదయాన్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచు, అది నీ కష్టకాలంలో నీకు అండగా నిలుస్తుంది అని మా నాన్న సుబీర్ సేన్ నాకు చెప్పిన మాటలు. ఇవి చాలా విలువైనవి. రెండు రోజుల క్రితం నేను గుండెపోటుకు గురయ్యాను. హాస్పిటల్ కి వెళ్తే యాంజియోప్లాస్టీ చేశారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి స్టెంట్‌ వేశారు. ప్రస్తుతం బాగానే ఉన్నాను. రెస్ట్ తీసుకుంటున్నాను. నాకు చికిత్స చేసిన కార్డియాలజిస్ట్‌ నా గుండె గట్టిది అని చెప్పారు. నా గురించి, నా ఆరోగ్యం గురించి నా అభిమానులకు, సన్నిహితులకు తెలియాలనే ఈ పోస్ట్ పెడుతున్నాను. నా కోసం నిలిచిన వారందరికీ ధన్యవాదాలు అని తెలిపింది.

Ranbir Kapoor : మేం బయటకు సంతోషంగా ఉన్నా.. లోపల మాత్రం బాధపడతాం..

దీంతో సుస్మిత గుండెపోటుకు గురయి చికిత్స తీసుకుందని తెలిసి పలువురు ప్రముఖులు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో రావాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.