Reduce Arthritis : ఈ ఆయిల్స్ ని వాడండి.. కీళ్ల నొప్పుల తగ్గుదల చూడండి..
ఈ రోజుల్లో చాలా మందికి కీళ్ళనొప్పులు అనేవి కామన్ గా ఉంటున్నాయి. కీళ్ళ నొప్పుల వలన ఛాతి, ఉదరం, వీపు భాగాలు కూడా నొప్పికి గురవుతాయి. భుజాలు, మోకాళ్ళు, మణికట్టు, కీళ్ళ నొప్పులు ఇలా ఎటువంటి నొప్పులకైనా............

Reduce Arthritis : ఈ రోజుల్లో చాలా మందికి కీళ్ళనొప్పులు అనేవి కామన్ గా ఉంటున్నాయి. కీళ్ళ నొప్పుల వలన ఛాతి, ఉదరం, వీపు భాగాలు కూడా నొప్పికి గురవుతాయి. భుజాలు, మోకాళ్ళు, మణికట్టు, కీళ్ళ నొప్పులు ఇలా ఎటువంటి నొప్పులకైనా అందరూ కూడా ఫిజియోథెరపీ చేయడం లేదా నొప్పి నివారణ మందులు ఇంకా హాట్ ప్యాక్ లు వాడడం వంటివి చేస్తుంటారు. కానీ ఇవి ఆ సమయానికి నొప్పి తగ్గించినా పూర్తిగా నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగించవు. కీళ్ళ నొప్పులను తగ్గించడానికి కొన్ని రకాల ఆయిల్స్ బాగా ఉపయోగపడతాయని పలువురు ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు తగ్గడానికి నువ్వుల నూనెను కొద్దిగా వేడి చేయాలి. ఈ గోరువెచ్చని నువ్వులనూనెను రోజుకు రెండు సార్లు మనకు నొప్పులు ఉన్నచోట రాయాలి. రాత్రి పడుకునేముందు కూడా నువ్వులనూనెను రాసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
ఆముదం నూనెను ఆయుర్వేదంలో బాగా వాడుతుంటారు. కొంచెం ఆముదం నూనెకు ఒక రావి వేరును ఉంచి దానిని వేడి చేయాలి. దీనిని రాత్రి పడుకునేముందు నొప్పి ఉన్నచోట రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది. నువ్వులనూనెతో శొంఠి, వెల్లుల్లిపాయలను వేసి చిన్న మంట మీద మరిగించాలి. ఇలా చేసినప్పుడు శొంఠి, వెల్లుల్లిలోని సారం నూనెలోనికి దిగుతుంది. ఇలా తయారైన నువ్వులనూనెను మనకు నొప్పి ఉన్నచోట రాత్రి పడుకునే ముందు మర్దన చేసుకుంటే నొప్పి తగ్గుతుంది.
Cleaning Bedsheets : మనం వాడే బెడ్‌షీట్స్, దుప్పట్లు ఎన్ని రోజులకి ఒకసారి ఉతకాలో తెలుసా?
ఆముదం ఆకుకు ఆముదం నూనెను రాసి పొయ్యి మీద చిన్న మంట మీద కొద్దిసేపు ఉంచాలి. తరువాత దానిని నొప్పి ఉన్నచోట కట్టుకోవాలి తరువాత కాసేపు నడవాలి. ఇలా చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. కొబ్బరినూనెలో కొద్దిగా కర్పూరం పొడి, శొంఠి పొడి వేసి మరిగించాలి. ఇలా మరిగిన నూనెను నొప్పి ఉన్న చోట మర్దన చేసుకోవాలి ఈ విధంగా చేయడం వలన కూడా నొప్పి తగ్గుతుంది. ఇలాంటి ఆయుర్వేద పద్దతులను వాడి కీళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చు.