Cleaning Bedsheets : మనం వాడే బెడ్‌షీట్స్, దుప్పట్లు ఎన్ని రోజులకి ఒకసారి ఉతకాలో తెలుసా?

మనం రోజూ వాడుకునే బట్టలు మనం రోజూ ఉతుక్కుంటాము. కానీ మనం రోజూ ఉపయోగించే బెడ్‌షీట్స్, దుప్పట్లు వంటివి రోజూ ఉతకాలంటే కష్టమైన పనే. కానీ మన ఇంట్లో..............

Kaburulu

Kaburulu Desk

February 22, 2023 | 06:50 AM

Cleaning Bedsheets : మనం వాడే బెడ్‌షీట్స్, దుప్పట్లు ఎన్ని రోజులకి ఒకసారి ఉతకాలో తెలుసా?

Cleaning Bedsheets :  మనం రోజూ వాడుకునే బట్టలు మనం రోజూ ఉతుక్కుంటాము. కానీ మనం రోజూ ఉపయోగించే బెడ్‌షీట్స్, దుప్పట్లు వంటివి రోజూ ఉతకాలంటే కష్టమైన పనే. కానీ మన ఇంట్లో పెట్స్ ఉన్నట్లైతే అవి బెడ్ వరకు వస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా రోజూ వాటిని కూడా ఉతకాలి. ఇంకా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో కూడా రోజూ ఉతకాలి. అలాంటి సమయంలో వాటిని వాషింగ్ మెషిన్ లో వేసి ఉతకవచ్చు.

మామూలుగా చాలా మంది తమ ఇంటిలో వాడే బెడ్ షీట్స్, దుప్పట్లు వంటి వాటిని నెలకు లేదా పదిహేను రోజులకు ఒకసారి ఉతుకుతుంటారు. కానీ పెట్స్, చిన్న పిల్లలు మన ఇంటిలో లేకపోయినా మనం ఖచ్చితంగా బెడ్ షీట్స్, దుప్పట్లను వారానికి ఒకసారి ఉతకడానికి వేసి వాటిని మారుస్తుండాలి.

అలాగే కొన్నిసార్లు దుప్పట్లు, బెడ్ షీట్స్ వాటి మీద ఏమైనా మరకలు పడుతుంటాయి. అలాంటి సమయంలో వాటిని ముందుగా కొంతసేపు ఆ మరకలపై సర్ఫ్ లేదా వెనిగర్ వేసి నానబెట్టాలి. ఇలా చేసి వాషింగ్ మెషిన్ లో వేయవచ్చు అప్పుడు మరకలు పోతాయి. డైరెక్టుగా మరకలు ఉన్నవి మెషిన్ లో వేస్తే అవి అలాగే ఉండిపోతాయి. వీటిని ఉతికిన తరువాత బాగా ఎండ తగిలేలా ఆరేయాలి. అప్పుడే వాటిలో ఇంకా ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా తొలగిపోతుంది.

Flower Vase : ఫ్లవర్ వాజ్ లో ఉంచే పువ్వులు ఎక్కువకాలం ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

అయితే కొంతమంది బెడ్ షీట్స్, దుప్పట్లను కూడా ఉతికిన తరువాత ఐరన్ చేస్తుంటారు. అయితే అప్పుడు వాటిపై మరకలు పోయాయో లేదో చూసుకోవాలి. చూడకుండా ఐరన్ చేస్తే ఆ మరకలు అలాగే ఉండిపోతాయి. కానీ వీటిని ఐరన్ చేయకపోయినా మంచిదే కాకపోతే బాగా ఎండలో ఆరనివ్వాలి. కాబట్టి మనం రోజూ ఉపయోగించే బెడ్ షీట్స్, దుప్పట్లు వంటివి కూడా వారానికి ఒకసారి ఉతుకుతూ ఉండాలి. అప్పుడే మన ఆరోగ్యానికి కూడా మంచిది. చిన్న పిల్లలు, పెట్స్ ఉన్నట్లైతే ఒక నాలుగు బెడ్ షీట్స్ ముందుగానే ఉంచుకొని రోజూ మారుస్తుండాలి.