Iron Rust Cleaning : ఇనుము వస్తువుల నుంచి తుప్పును ఎలా తొలగించాలా తెలుసా..

Kaburulu

Kaburulu Desk

December 27, 2022 | 09:00 PM

Iron Rust Cleaning : ఇనుము వస్తువుల నుంచి తుప్పును ఎలా తొలగించాలా తెలుసా..

Iron Rust Cleaning :  ఇనుము వస్తువులు, పనిముట్లు, ఇనుప మంచం, జీన్స్ గుండీలు… ఇలా ఏదయినా ఇనుప వస్తువులు నీళ్ళు తగిలినా, తగలకపోయినా కూడా తుప్పు పడుతూ ఉంటాయి. కాబట్టి తుప్పు పట్టకుండా ఉండడానికి ఇనుప వస్తువులను పొడి ప్రదేశంలో ఉంచాలి లేదా ఒక ప్లాస్టిక్ కవర్ ను ఇనుప వస్తువులకు కట్టి ఉంచాలి. అప్పుడు తొందరగా తుప్పు పట్టదు. తుప్పు పట్టినట్లైతే కొన్ని చిట్కాలను ఉపయోగించి తొలగించవచ్చు.

Children’s Using Phones : మీ పిల్లలకి సెల్ ఫోన్స్ ఇస్తున్నారా?? వాళ్ళ కంటికి ప్రమాదం..

*తుప్పు పట్టిన వస్తువులను రాత్రంతా వెనిగర్ లో ముంచి ఉంచాలి ఉదయం కాటన్ క్లాత్ తో తుడిచి పెట్టాలి. వాటిని శుభ్రంగా తుడిచిన తరువాత మామూలు స్థితికి వస్తాయి.
*బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి తుప్పు పట్టిన చోట రాయాలి. 15 నిముషాల తర్వాత పొడి టవల్ తో తుడిస్తే తుప్పు మరకలు పోతాయి.
*నిమ్మరసం, తెలుపు వెనిగర్, ఉప్పు ఈ మూడింటిని కలిపి తుప్పు మరకలపై రాసి బ్రష్ చేసి తరువాత నీటితో కడగాలి అప్పుడు తుప్పు మరకలు పోతాయి.
*సిట్రిక్ ఆసిడ్ లో ఉప్పు వేసి కలిపి దానిని బట్టలపై తుప్పు మరకలు ఉన్న చోట వేసి బ్రష్ చేయాలి. తరువాత ఎండలో బట్టలను ఆరబెట్టాలి.
*సిట్రిక్ యాసిడ్, సోడియం క్లోరైడ్ కలిపి దానితో పాటు నిమ్మరసం, ఉప్పు కూడా కలిపి బట్టలపై బ్రష్ చేస్తే ఎలాంటి తుప్పు మరకలైనా పోతాయి.
*తుప్పు మరకలు ఉన్న ఇనుము కిటికీలు లాంటి వాటికి బ్రష్ పెట్టి రుద్దాలి. అప్పుడు ఉన్న తుప్పు రాలిపోతుంది. అప్పుడు పెయింట్ వేయాలి ఇలా చేస్తే ఇంకొకసారి తుప్పు పట్టదు.
*బంగాళాదుంపను సగానికి కోసి దానిని డిష్ సోప్ లో ఉంచి కాసేపటి తరువాత బంగాళాదుంపను కొన్ని గంటల పాటు తుప్పు మరకలు ఉన్నచోట పెడితే మరకలు పోతాయి.