New Year arrangements in Tirupati:తిరుపతిలో నూతన సంవత్సర ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారా…?

Kaburulu

Kaburulu Desk

December 27, 2022 | 09:55 PM

New Year arrangements in Tirupati:తిరుపతిలో నూతన సంవత్సర ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారా…?

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న వివిధ రకాల ఉత్సవాలైన న్యూ ఇయర్, వైకుంఠ ద్వార దర్శనం వంటి వాటికి సంబంధించిన కొన్ని అప్డేట్స్, సూచనలు, సలహాలు అందించారు. వీటిలో కొన్ని భక్తులు తప్పక పాటించవలసినవి కూడా ఉన్నాయి.. అవేంటో ఇపుడు తెలుసుకుందాం…

రాబోయే న్యూఇయర్, వైకుంఠ ఏకాదశి దర్శనాలకు టీటీడీ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠద్వార దర్శనం కోసం విస్త్రుతంగా ఏర్పాట్లు చేపట్టింది. జనవరి 1 న మధ్యాహ్నం 2 గంటల నుండి సర్వదర్శనం టోకన్ల జారీ చేయనున్నారు.  4.50 లక్షల టోకన్ల కోటా ముగిసే వరకు తిరుపతిలో 9 కేంద్రాల్లో కౌంటర్లు తెరచి ఉంటాయి.  భక్తులు సులభంగా కౌంటర్లను చేరుకునేందుకు వీలుగా పలుప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆన్ లైన్ లో 2.05 లక్షల రూ300 దర్శన టిక్కెట్లు, 20 వేల శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు.

రద్దీ దృష్ట్యా జనవరి 2, 3 తేదీల్లో సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనాల కేటాయింపు రద్దు చేశారు. విఐపీలు స్వయంగా వస్తే మాత్రమే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు బ్రేక్ దర్శనం కేటాయిస్తారు.  3.5 లక్షల అదనపు ప్రసాదపు లడ్డూలు ముందస్తుగా నిల్వ చేశారు. కల్యాణకట్టల్లో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు అదనపు క్షురకులను నియమించారు.  వైకుంఠద్వార దర్శనం ఉండే పదిరోజుల పాటు 24 గంటల పాటు రెండు ఘాట్ రోడ్లు తెరచే ఉంటాయి. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా తిరుమలకు వచ్చే భక్తులు ఫేస్ మాస్క్ ధరించాలని, వ్యక్తిగత నియంత్రణ చర్యలు, శానిటైజేషన్ తప్పనిసరని ఛైర్మన్ తెలిపారు.

3500 శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు చేపట్టనున్నారు, డిసెంబర్ 31, జనవరి 1 న తిరుపతిలో సర్వదర్శనం టోకన్లు జారీ రద్దు చేశారు. గోవిందమాల భక్తులు సైతం టోకెన్లు, టిక్కెట్టు ఉంటేనే వైకుంఠద్వార దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు.