Eating Chicken : కోడి మాంసం రోజూ తింటున్నారా?? అయితే ఆరోగ్య సమస్యలు తప్పవు..

Kaburulu

Kaburulu Desk

December 27, 2022 | 08:00 PM

Eating Chicken : కోడి మాంసం రోజూ తింటున్నారా?? అయితే ఆరోగ్య సమస్యలు తప్పవు..

Eating Chicken :  చాలా మందికి చికెన్ తిననిదే రోజూ ముద్ద దిగదు. కానీ చికెన్ తినేవాళ్ళు దానిని బాగా ఉడికించి తినాలి అంతేకాని ఫ్రై, డీప్ ఫ్రై చేసుకొని తినకూడదు. ఫ్రై వంటివి చేసుకొని రోజూ తింటూ ఉంటే మన శరీరంలోని కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. చికెన్ రోజూ తినడం వలన మన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ వేడి వలన ముక్కులో నుండి రక్తం కారడం జరుగుతుంది. ఇలా జరిగినపుడు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తరువాత తినాలి.

రోజూ చికెన్ తినడం వలన వచ్చే ఇంకొక సమస్య బరువు పెరగడం. చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ చికెన్, బటర్ చికెన్ తినడం వలన అధిక క్యాలరీలు మన శరీరానికి అంది బరువు తొందరగా విపరీతంగా పెరుగుతారు. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని కూడా పెంచుతుంది. రోజూ చికెన్ తినడం వలన యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి.

Children’s Using Phones : మీ పిల్లలకి సెల్ ఫోన్స్ ఇస్తున్నారా?? వాళ్ళ కంటికి ప్రమాదం..

పౌల్ట్రీ రైతులు వారు పెంచే కోళ్ళకు తొందరగా పెరగడానికి యాంటిబయోటిక్ ఇంజెక్షన్లను బలవంతంగా ఇస్తూ ఉంటారు. ఇలాంటి చికెన్ తినడం వలన మన శరీరంలో యాంటిబయోటిక్ నిరోధకత పెరిగిపోతుంది అంటే మనకు ఏదయినా అనారోగ్యం వచ్చినపుడు డాక్టర్లు ఇచ్చే యాంటీబయోటిక్స్ మన బాడీ మీద పనిచేయవు. రోజూ చికెన్ తింటే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి రెగ్యులర్ గా చికెన్ తినే అలవాటు ఉంటే మార్చుకోండి లేకపోతే అనారోగ్యానికి గురవుతారు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు తింటే పర్లేదు కానీ అదేపనిగా రోజూ మాత్రం చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.