Children’s Using Phones : మీ పిల్లలకి సెల్ ఫోన్స్ ఇస్తున్నారా?? వాళ్ళ కంటికి ప్రమాదం..

Kaburulu

Kaburulu Desk

December 27, 2022 | 06:49 PM

Children’s Using Phones : మీ పిల్లలకి సెల్ ఫోన్స్ ఇస్తున్నారా?? వాళ్ళ కంటికి ప్రమాదం..

Children’s Using Phones :  కరోనా టైములో పిల్లలందరికీ ఆన్లైన్ క్లాసెస్ మరియు బయట ఆటలు ఆడడం తగ్గడం వలన ఎక్కువ సమయాన్ని ఫోన్స్ లోనే గడిపారు. కరోనాకు ముందు ప్రతి వంద మందిలో 5 గురికి కంటి సమస్య ఉండేది కానీ కరోనా తర్వాత ప్రతి వంద మందిలో 20 మందికి కంటి సమస్య ఏర్పడిందని పలువురు డాక్టర్లు చెప్తున్నారు. ఇదేవిధంగా ఫోన్స్ వాడుతూ ఉంటే 2050 నాటికి ప్రపంచంలో సగం జనాభా కంటి సమస్యకు గురి అవుతారని ఒక సర్వే ప్రకారం తేలిందని కంటి నిపుణులు అంటున్నారు.

కంటికి సంబంధించి ఎక్కువమందికి మయోపియా అనే సమస్య వస్తుంది పిల్లల్లో. ఎక్కువగా మూడు నుండి ఎనిమిదేళ్ళ వయసు గల పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లలు తొందరగా కంటి సమస్యల గురించి తమ తల్లితండ్రులకు చెప్పరు కాబట్టి పిల్లలకు సంవత్సరానికి ఒకసారైనా కంటి పరీక్షలు చేపించాలి. అప్పుడు పిల్లలకు ఏమైనా కంటి సమస్యలు ఉంటే తెలుస్తుంది.

Finger Millet’s : రాగిపిండి.. రాగిజావ.. ఇలా రాగులతో ఏదైనా ఆరోగ్యమే..

మయోపియా సమస్యను తగ్గించడానికి పిల్లలను టీవీలకు, సెల్ ఫోన్స్ కు ఎక్కువగా దూరంగా ఉంచాలి. పిల్లలు ఎక్కువగా బయట ఆడుకునేలా చేయడం, పౌష్టికాహారం తినేలా చేయడం వలన మయోపియా సమస్యను పిల్లల్లో తగ్గించవచ్చు. కొంతమందిలో జెనెటిక్ గా కూడా చిన్నతనంలోనే కంటి సమస్యలు వస్తాయని అంటున్నారు డాక్టర్లు. కాబట్టి చిన్నపిల్లల్లో కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే ఫోన్స్ ని, టీవీలని దూరం పెట్టడం, లేదా వాడకం తగ్గించడం చేయాలి.