Betel Leafs : తమలపాకులు తినడం అలవాటు చేసుకోండి..

Kaburulu

Kaburulu Desk

December 23, 2022 | 06:00 PM

Betel Leafs : తమలపాకులు తినడం అలవాటు చేసుకోండి..

Betel Leafs :  మనకు ప్రకృతి ప్రసాదించిన చెట్లు, ఆకులతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. కానీ అలాంటి చెట్లని, ఆకులని తినడం మానేసి ఏవేవో తింటూ లేనిపోని రోగాలని తెచ్చుకుంటూ మళ్ళీ అవి తగ్గించుకోవడానికి మందుల కోసం పరిగెడుతున్నాం. ఎన్నో ఔషధ గుణములు ఉన్న మొక్క తమలపాకు మొక్క. దైవభక్తికి కాకుండా ఆరోగ్యానికి కూడా తమలపాకులను ఉపయోగిస్తారు. తమలపాకును ఇప్పుడు ఎక్కువగా తాంబూల రూపంలో వాడుతుంటాం. గతంలో చాలామంది తమ ఇళ్ళలో కూడా తమలపాకుల చెట్లను పెంచుకునేవారు. పూర్వం రోజుల్లో అయితే అన్నం తిన్నాక తాంబూలం వేసుకోవడం ఒక ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడు కొన్ని పెళ్లిళ్లు, ఫంక్షన్స్ లో కిల్లి ఇస్తే తినడం తప్ప బయట మనం తమలపాకులు తినట్లేదు.

Vitamin D : ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?? అయితే మీకు విటమిన్ ‘డి’ లోపం ఉన్నట్టే..

*తమలపాకుల వాడకంలో మహిళలకు క్యాల్షియం సమస్య పోతుంది.
*గొంతు నొప్పి నివారణకు ఈ తమలపాకుల రసాన్ని ఉపయోగిస్తారు.
*శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. తమలపాకులో ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ ఆమ్లం, కంటిచూపును పెంచే విటమిన్ A, రోగ నిరోధకశక్తిని పెంచే విటమిన్ సి తమలపాకులో పుష్కలంగా ఉంటాయి.
*శ్వాసకోశ వ్యాధులకు ఈ ఆకుకు నూనె రాసి కొద్దిగా వేడి చేసి గడ్డకట్టిన శరీర భాగంలో ఉంచుతారు.
*తమలపాకులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో అంతకంటే ఎక్కువగానే మేలు చేస్తుంది ఈ తమలపాకు.
*చిన్న పిల్లలకి లేదా పసి పిల్లలకు జలుబు చేసి ఇబ్బంది పడుతున్నప్పుడు తమలపాకును వేడిచేసి ఆముదం రాసి ఛాతీపై ఉంచితే జలుబు తగ్గిపోతుంది.
*తమలపాకుల షర్బత్ తాగితే గుండె బలహీనత, కఫము తగ్గుతుంది.
*తమలపాకులోని విటమిన్ సి మంచి యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసి మన శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
*తమలపాకుల రసాన్నిపాలల్లో కలిపి తీసుకుంటే క్షణిక ఆవేశాలు తగ్గుతాయి.
*నువ్వుల నూనె, ఆవనూనె, వేరుశెనగ నూనె, ప్రొద్దు తిరుగుడు నూనె, త్వరగా చెడిపోకుండా ఉండాలంటే వాటిల్లో తమలపాకులు వేసి ఉంచాలి.
ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి తమలపాకును తినడం అలవాటు చేసుకోండి. కేవలం వట్టి తమలపాకుని తినకపోయినా భోజనం తర్వాత కిల్లి అయినా అలవాటు చేసుకుంటే మంచిది.