NTR : అజ్ఞాతంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్..

Kaburulu

Kaburulu Desk

December 23, 2022 | 05:35 PM

NTR : అజ్ఞాతంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్..

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకోవడమే కాకుండా వరల్డ్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇంతటి హిట్టు అందుకున్నా, తన తదుపరి సినిమాని మొదలుపెట్టడంలో మాత్రం తడబడతున్నాడు తారక్. RRRతో క్రియేట్ అయిన పాన్ ఇండియా మార్కెట్ ని నిలబెట్టుకొనేలా, సినిమా కథలు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఎన్టీఆర్.

NTR : ఫిబ్రవరిలో మొదలుకానున్న NTR30.. స్పెషల్ వీడియో రెడీ చేస్తున్న కొరటాల..

దీంతో కథ అంతా పక్కా అనుకున్నాకే సెట్స్ పైకి వెళదామని నిర్ణయం తీసుకున్నాడు ఈ హీరో. ఇక ఎలాగో గ్యాప్ రావడంతో ఫ్యామిలీతో వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల కుటుంబంతో కలిసి అమెరికా వెళ్ళాడు ఎన్టీఆర్. సాధారణంగా హీరోలు వెకేషన్ కి వెళితే ఆ హాలిడే ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. కానీ తారక్ మాత్రం ఇందుకు పూర్తీ విరుద్ధంగా ఉంటాడు.

ఇటీవల అమెరికా వెళ్లిన తరువాత, మియామీ బీచ్ వద్ద భార్య ప్రణతితో ఉన్న ఒక్క ఫోటోని షేర్ చేయడం తప్ప.. ఎన్టీఆర్ గురించి మరో క్లూ లేదు. అసలు తారక్ ఎక్కడ ఉన్నాడో అనేది అమెరికాలోని అభిమానులకు కూడా అంతుచిక్కడం లేదు. మరి ఈ అజ్ఞాతవాసం నుంచి ఎన్టీఆర్ ఎప్పుడు బయటకి వస్తాడో ఎదురు చూడాలి.