Balayya – Pawan : బాలయ్య సినిమా సెట్‌లో పవన్ కళ్యాణ్..

Balayya – Pawan : నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. బాలయ్య వింటేజ్ లుక్ అండ్ స్టోరీతో వస్తున్న ఈ సినిమాకి మలినేని గోపీచంద దర్శకత్వం వహిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
Balakrishna : మా అబ్బాయికి ‘మోక్షజ్ఞ’ పేరుని నాన్న ఇక్కడే పెట్టారు.. బాలకృష్ణ!
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. అయితే ఈరోజు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సడన్ గా ఈ సినిమా సెట్ లోకి ఎంట్రీ ఇచ్చి అందర్నీ షాక్ గురి చేశాడు. వీరసింహారెడ్డి సెట్‌లో వీరమల్లు అంటూ.. అందుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో దర్శనమివ్వగా, అది కాస్త వైరల్ గా మారింది.
కాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోకి.. త్వరలో పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సమయంలో వీరిద్దరి కలయిక ఆ వార్తలు నిజమనేలా ఉన్నాయి. డిసెంబర్ 27న ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది అంటూ ఫిల్మ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అన్‌స్టాపబుల్ స్టేజిపై వీరిద్దరి కలియక ఉండనుందో? లేదో? చూడాలి.