Vitamin D : ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?? అయితే మీకు విటమిన్ ‘డి’ లోపం ఉన్నట్టే..

Kaburulu

Kaburulu Desk

December 22, 2022 | 11:05 AM

Vitamin D : ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?? అయితే మీకు విటమిన్ ‘డి’ లోపం ఉన్నట్టే..

Vitamin D : ఆరోగ్యానికి విటమిన్స్ ఎంతో అవసరం. అన్ని విటమిన్స్ సరైన మోతాదులో అందకపోతే శరీరపు పనితీరు దెబ్బతింటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్, స్టడీ ఫ్రమ్ హోమ్ నడుస్తున్న ఈ రోజుల్లో చాలా మంది అసలు ఇంట్లో నుండి బయటకు రావట్లేదు. దీంతో చాలా మందికి విటమిన్-డి లోపం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.

విటమిన్ డి అనేది ఒక స్టెరాయిడ్ హార్మోన్. ఇది సూర్యరశ్మి వల్ల శరీరంలో యాక్టివేట్ అవుతుంది. అంతేకాకుకండా కొన్ని ఆహార పదార్థాల నుండి వస్తుంది. శరీరానికి కాల్షియంని గ్రహించాలంటే విటమిన్ డి అవసరం. బోన్ హెల్త్ కి కూడా విటమిన్-డి చాలా ముఖ్యం. విటమిన్-డి తక్కువ అయితే చిన్నపిల్లల్లో రికెట్స్ కి దారితీస్తే, పెద్దవారిలో ఎముకలు పెళుసుబారిపోతాయి. మరి కొన్ని మెడికల్ కండిషన్స్ కి దారి తీస్తాయి. విటమిన్ డి తగ్గడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, హార్ట్ డిసీజెస్.. ఇంకా మరికొన్ని ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తరచుగా అనారోగ్యానికి గురవ్వటం, తరచుగా అలసిపోవడం, డిప్రెషన్ చెందడం, జుట్టు రాలటం, వివిధ చర్మ సమస్యలు రావడం, దద్దుర్లు, మొటిమలు రెగ్యులర్ గా రావడం, చర్మం పగలటం.. ఇలాంటి సమస్యలు మీలో రెగ్యులర్ గా కనిపిస్తే ఇవి కచ్చితంగా విటమిన్ D లోపమే.

Morning Tea : మీకు ఉదయాన్నే నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఉందా??

విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని మీ ఆహార ప్రణాళికకు జోడించాలి. ఎండలో అప్పుడప్పుడు తిరగడం మూలంగా చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. వైద్యుల అభిప్రాయం మేరకు పగటిపూట సూర్యరశ్మికి తిరగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. విటమిన్ ‘డి’ సూర్యరశ్మి నుంచి తొందరగా అందుతుంది. చేపలు, గుడ్డులోని పచ్చసొన, కార్డిలివర్ ఆయిల్, ఆరోగ్యవంతమైన బ్రేక్ ఫాస్ట్, మిల్క్, ఆరంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా విటమిన్ D లోపాన్ని తగ్గించొచ్చు.