K Viswanath : కళామతల్లి ముద్దుబిడ్డ కళాతపస్వి కె విశ్వనాథ్ ఇక లేరు..

తెలుగు చిత్ర సీమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంత కాలంగా ఇండస్ట్రీలోని పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు మరణిస్తూ వస్తున్నారు. తాజాగా కళామాతలి ముద్దుబిడ్డ కళాతపస్వి కె విశ్వనాథ్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో సినీ వర్గాల్లో విషాదఛాయలు అలుమున్నాయి.

Kaburulu

Kaburulu Desk

February 3, 2023 | 07:43 AM

K Viswanath : కళామతల్లి ముద్దుబిడ్డ కళాతపస్వి కె విశ్వనాథ్ ఇక లేరు..

K Viswanath : తెలుగు చిత్ర సీమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంత కాలంగా ఇండస్ట్రీలోని పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు మరణిస్తూ వస్తున్నారు. ఇటీవల సీనియర్ నటి జామున మరణించగా, నిన్న (జనవరి 2) సీనియర్ డైరెక్టర్ విద్యాసాగర్ మరణించారు. ఆయన మరణ వార్త జీర్ణించుకోక ముందే టాలీవుడ్ లోని మరో అగ్ర దర్శకుడు మరణం సినీ పరిశ్రమని కలిచి వేస్తుంది. కళామాతలి ముద్దుబిడ్డ కళాతపస్వి కె విశ్వనాథ్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో సినీ వర్గాల్లో విషాదఛాయలు అలుమున్నాయి.

Project K : రెండు భాగాలుగా ప్రభాస్ ప్రాజెక్ట్-K?

గత కొంతం కాలంగా వయోభారంతో బాధ పడుతున్న విశ్వనాథ్.. చికిత్స పొందుతూ వస్తున్నారు. రెండు రోజులు క్రితం తీవ్ర అస్వస్థతికి గురి కావడంతో హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఆయన జనవరి 2న రాత్రి 10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. కె విశ్వనాథ్ అకాల మరణానికి చింతిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.

1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించిన కె విశ్వనాథ్.. 1965లో వచ్చిన ఆత్మగౌరవం సినిమాతో ఇండస్ట్రీకి పరిచమయ్యారు. సినిమా అంటే పాటలు, ఫైట్ లు అని అనుకోకుండా దానిని ఒక తపస్సులా భావించి తన సినిమాతో అంతరించిపోతున్న గ్రామీణ, భారతీయ కళలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వచ్చారు. అంతేకాదు ఆయన సినిమాల్లో సంగీతానికి, సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేవారు. మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి అయినా ఆయన సినిమాలో కథ కోసం చెప్పులు కుట్టాల్సిందే. స్వయంకృషి, ఆపద్బాంధవుడు, స్వాతిముత్యం, శంకరాభరణం, సిరివెన్నెల, స్వర్ణకమలం ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించారు.

శంకరాభరణం సినిమా అయితే నేషనల్ అవార్డుతో పాటు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు కూడా గెలుచుకుంది. దర్శకుడిగా ఎన్నో అత్యునత పురస్కారాలు అందుకున్నారు. అంతేకాదు 1992లో పద్మశ్రీ అవార్డు, 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఇప్పటి దర్శకులకు ఆయన ఒక పుస్తకం లాంటి వారు. దర్శకుడి గానే కాదు నటుడిగా కూడా ఆయన అనేక సినిమాల్లో నటిస్తూ వచ్చారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి.