Hansika : పెళ్లి చేసుకోబోతున్న హన్సిక.. బాయ్‌ఫ్రెండ్ తో ఈఫిల్ టవర్ వద్ద సందడి..

Kaburulu

Kaburulu Desk

November 3, 2022 | 08:02 AM

Hansika : పెళ్లి చేసుకోబోతున్న హన్సిక.. బాయ్‌ఫ్రెండ్ తో ఈఫిల్ టవర్ వద్ద సందడి..

Hansika :  చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి చిన్న ఏజ్ లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది యాపిల్ బ్యూటీ హన్సిక. తెలుగు, తమిళ్, హిందీలో దాదాపు 50 సినిమాలు చేసింది హన్సిక. గత కొన్నేళ్లుగా నెమ్మదిగా సినిమాలు చేస్తుంది. కొన్ని రోజులుగా హన్సిక పెళ్లి చేసుకోబోతోంది వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా హన్సిక స్పందించింది.

Unstoppable : బాలకృష్ణ అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్.. యువ హీరోలతో కలిసి రచ్చ చేసిన బాలయ్య..

హన్సిక తన కాబోయే భర్తతో ఈఫిల్ టవర్ వద్ద రొమాంటిక్ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలని షేర్ చేస్తూ.. ”ఐ లవ్‌ యూ సోహెల్‌ ఖత్తూరియా.. నౌ ఫరెవర్‌” అని పోస్ట్ చేసింది. సోహెల్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త అని తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నట్టు, ఇరువైపులా కుటుంబాలు ఒప్పుకోవడంతో హన్సిక అధికారికంగా ప్రకటించినట్టు సమాచారం. డిసెంబర్ లో వీరి పెళ్లి కేవలం సన్నిహితుల మధ్య మాత్రమే జరగనున్నట్టు తెలుస్తుంది. పెళ్లి డేట్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు హన్సిక.