Karate Kalyani : దేవిశ్రీ ప్రసాద్ పై ఫైర్ అయిన కరాటే కళ్యాణి.. పోలీసులకి ఫిర్యాదు..

Kaburulu

Kaburulu Desk

November 3, 2022 | 08:04 AM

Karate Kalyani : దేవిశ్రీ ప్రసాద్ పై ఫైర్ అయిన కరాటే కళ్యాణి.. పోలీసులకి ఫిర్యాదు..

Karate Kalyani :  ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల ఓ ప్రైవేట్ ఆల్బమ్ ని రిలీజ్ చేశాడు. ఓ పరి.. అని సాగే ఈ పాటని పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేశాడు దేవిశ్రీ. అయితే ఈ పాటలో హరే రామ హరే కృష్ణ అని వస్తుంది. దీనిపై పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా నటి కరాటే కళ్యాణి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేవిశ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది.

Hansika : పెళ్లి చేసుకోబోతున్న హన్సిక.. బాయ్‌ఫ్రెండ్ తో ఈఫిల్ టవర్ వద్ద సందడి..

అనంతరం కరాటే కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఐటెం సాంగ్ లా ఆ పాటని చిత్రీకరించి అందులో హరే రామ హరే కృష్ణ పెట్టడం చాలా తప్పు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పాటలోంచి ఆ పదాలని తీసేయాలని, దేవిశ్రీ ప్రసాద్ పై యాక్షన్ తీసుకోవాలని పోలీసులని కోరాము. పాట నుంచి దాన్ని తొలిగించకపోతే దేవిశ్రీ ప్రసాద్ ఆఫీస్ ని ముట్టడిస్తాము అని తెలిపింది. దీనిపై ఇప్పటివరకు దేవిశ్రీ మాత్రం స్పందించలేదు.