Hansika : హన్సిక పెళ్లి వీడియో, పెళ్లి గురించి మొత్తం చూడాలనుకుంటున్నారా.. ఈ ఓటీటీలోకి వచ్చేస్తుంది..

హన్సిక ఇటీవలే సోహైల్ కతూరియా అనే ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు వీరి పెళ్లి వీడియో రానుంది. అయితే హన్సిక - సోహైల్ పెళ్లి వీడియో...............

Kaburulu

Kaburulu Desk

January 31, 2023 | 02:03 PM

Hansika : హన్సిక పెళ్లి వీడియో, పెళ్లి గురించి మొత్తం చూడాలనుకుంటున్నారా.. ఈ ఓటీటీలోకి వచ్చేస్తుంది..

Hansika : మనలో చాలామందికి సెలబ్రిటీల లైఫ్ లో ఏం జరుగుతుందో, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంటుంది. ఇక సెలబ్రిటీల పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు లాంటివి అయితే ఆ ఫోటోలు, వీడియోల కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పుడు సెలబ్రిటీలు మన ఆసక్తిని క్యాష్ చేసుకుంటున్నారు. కొంతమంది సెలబ్రిటీలు వాళ్ళ పర్సనల్ లైఫ్, ఫంక్షన్స్ లాంటివి యూట్యూబ్ ఛానల్స్ లో పెట్టుకొని డబ్బులు సంపాదిస్తుంటే స్టార్ సెలబ్రిటీలు ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా ఓటీటీలలో తమ పెళ్లి వీడియోల్ని పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు.

ఇటీవల నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో జరిగిన తన వివాహాన్ని నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి ఇచ్చింది. వారి పెళ్లి వీడియో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందుకోసం నయనతార నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీగానే పుచ్చుకుందని సమాచారం. ఇప్పుడు నయనతార బాటలో మరో హీరోయిన్ యాపిల్ బ్యూటీ హన్సిక కూడా వెళ్తుంది.

They Call Him OG : పవన్ – సుజీత్ సినిమా పూజా కార్యక్రమం గ్యాలరీ..

హన్సిక ఇటీవలే సోహైల్ కతూరియా అనే ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు వీరి పెళ్లి వీడియో రానుంది. అయితే హన్సిక – సోహైల్ పెళ్లి వీడియో డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 10 నుంచి వీరి పెళ్లి వీడియో స్ట్రీమ్ అవ్వనుంది. తాజాగా ఈ పెళ్ళికి సంబంధించిన ఓ ప్రోమోని హన్సిక లవ్ షాదీ డ్రామా అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ లో ఉండగా ఇక హన్సిక పెళ్లి వీడియో కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. తమ పెళ్లి వీడియోని ఓటీటీలో పెట్టడానికి హన్సిక కూడా డిస్నీప్లస్ హాట్ స్టార్ నుంచి బాగానే అమౌంట్ తీసుకుందని సమాచారం.