Unstoppable : బాలకృష్ణ అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్.. యువ హీరోలతో కలిసి రచ్చ చేసిన బాలయ్య..

Kaburulu

Kaburulu Desk

November 1, 2022 | 08:24 AM

Unstoppable : బాలకృష్ణ అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్.. యువ హీరోలతో కలిసి రచ్చ చేసిన బాలయ్య..

Unstoppable : బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. రెండో సీజన్ మొదలయి ఇప్పటికే రెండు ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు ఎపిసోడ్స్ కి కూడా మంచి ఆదరణ లభించింది. తాజాగా మూడో ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. మూడో ఎపిసోడ్ కి యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్ వచ్చారు.

శర్వానంద్ రావడంతోనే బాలకృష్ణకి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. గత ఎపిసోడ్ లో రష్మిక నా క్రష్ అని బాలయ్య చెప్పడంతో శర్వానంద్ రష్మికకి వీడియో కాల్ చేసి బాలయ్యతో మాట్లాడించాడు. దీంతో బాలయ్య ఫుల్ హ్యాపీ అయ్యారు. అడివి శేష్ కూడా ఓ గిఫ్ట్ ప్యాక్ తీసుకొచ్చి ఇచ్చాడు. వారి సినిమాల గురించి, హీరోయిన్స్ గురించి సరదాగా మాట్లాడారు. ఈ యువ హీరోలు చేసిన చిలిపి పనుల గురించి మాట్లాడారు. శర్వానంద్ జాను సినిమా సమయంలో అయిన యాక్సిడెంట్ ని తలుచుకొని బాధపడ్డాడు. అడివి శేష్, శర్వానంద్, బాలకృష్ణ కలిపి డ్యాన్సులు వేస్తూ రచ్ఛ చేశారు.

Rambha : రంభ కారుకి యాక్సిడెంట్.. ఆసుపత్రిలో కూతురు.. దెబ్బలతో బయటపడ్డ రంభ

మొత్తానికి ఈ ఎపిసోడ్ మాత్రం ఫుల్ ఫన్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇద్దరు యువ హీరోలతో కలిసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు బాలయ్య బాబు. నవంబర్ 4 నుంచి ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనుంది.