Breaking : Jamuna : సీనియర్ నటి జమున కన్నుమూత..

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు.. లాంటి ఎంతోమంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటి జమున నేడు ఉదయం మరణించారు..............

Kaburulu

Kaburulu Desk

January 27, 2023 | 09:56 AM

Breaking : Jamuna : సీనియర్ నటి జమున కన్నుమూత..

Jamuna :  గత కొంతకాలంగా టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతి రావు.. లాంటి స్టార్లు, మరికొంతమంది సినీ ప్రముఖులు ఇటీవల వరుసగా మరణించి టాలీవుడ్ ని విషాదంలో ముంచేశారు. వాటి నుంచి తేరుకోకముందే తాజాగా టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది.

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు.. లాంటి ఎంతోమంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటి జమున నేడు ఉదయం మరణించారు. భూకైలాస్‌, పెళ్ళినాటి ప్రమాణాలు, అప్పుచేసి పప్పుకూడు, ఇల్లరికం, ఈడూజోడూ, రాముడు భీముడు, శ్రీకృష్ణ తులాభారం, గులేబకావళికథ, లేతమనసులు, ఉండమ్మా బొట్టుపెడతా, బొబ్బిలియుద్ధం, తాసిల్దారుగారి అమ్మాయి, మట్టిలో మాణిక్యం, ఏకవీర, పండంటి కాపురం..లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి అభిమానులని సంపాదించుకుంది. మొదటిసారి వినాయక చవితి సినిమాలో సత్యభామ పాత్ర పోషించింది జమున. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం సినిమాలో మరోసారి సత్యభామ పాత్ర పోషించి అదరగొట్టేసింది. ఆ సినిమాతో టాలీవుడ్ వెండితెర సత్యభామగా పేరు తెచ్చుకుంది జమున.

Balakrishna : ఫ్లోలో అన్న మాటలని వివాదం చేశారు.. ఏఎన్నార్ నాకు బాబాయ్..

గత కొన్నేళ్లుగా సినిమాలకి దూరంగానే ఉంటున్నారు జమున. ప్రస్తుతం తన పిల్లలతో కలిసి హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. కొన్నిరోజులుగా వయోభారం సమస్యలతో బాధపడుతున్న జమున 86 ఏళ్ళ వయసులో నేడు ఉదయం(జనవరి 27)న 7 గంటలకు తన స్వగృహంలో మరణించారు. నేడు ఉదయం 11 గంటలకు జమున పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ వద్దకు అభిమానులు, ప్రముఖులు సందర్శనార్థం తరలించనున్నారు. జమున మరణంతో టాలీవుడ్ లో మరోసారి విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.