Punarnavi : అనారోగ్యంతో బాధపడుతున్నానంటూ మరో నటి పోస్ట్..

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన హెల్త్ గురించి పోస్ట్ చేసి కొత్త సంవత్సరంలో అందరికి బ్యాడ్ న్యూస్ చెప్పింది పునర్నవి. తన స్టోరీలో డల్ గా ఉన్న తన ఫేస్ ని పోస్ట్ చేసి దానిపై........

Kaburulu

Kaburulu Desk

January 4, 2023 | 02:17 PM

Punarnavi : అనారోగ్యంతో బాధపడుతున్నానంటూ మరో నటి పోస్ట్..

Punarnavi :  ఇటీవల కొంతమంది టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు తాము ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిపి అభిమానులకి, ప్రేక్షకులకి షాకిస్తున్నారు. దీంతో వాళ్ళు త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు. తాజాగా మరో టాలీవుడ్ నటి తాను ఓ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు చెప్పి కొత్త సంవత్సరం మొదట్లోనే షాక్ ఇచ్చింది.

ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ తో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది పునర్నవి భూపాలం. మొదటి సినిమాతో మెప్పించినా ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. ఓ పక్కన సైకాలజీ చదువుతూ వచ్చిన ఆఫర్స్ చేసింది పునర్నవి. అడపాదడపా కొన్ని సినిమాలు చేసినా పునర్నవికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ 2019లో బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత బాగా ఫేమస్ అయింది ఈ భామ. ఈ షోతో మరింత పాపులారిటీ తెచ్చుకొని సోషల్ మీడియాలో బాగానే ఫేమస్ అయింది పునర్నవి.

బిగ్ బాస్ షో తర్వాత తనకి పలు అవకాశాలు వచ్చాయి. కమిట్ మెంటల్ అనే సిరీస్ లో నటించింది. పలు టీవీ షోలలో కూడా కనిపించింది. అలాగే పలు సినిమాల్లో అవకాశాలు వస్తున్న సమయంలో సైకాలజీలో మాస్టర్స్ చేయడానికి లండన్ వెళ్ళిపోయింది పునర్నవి. అక్కడికి వెళ్లినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటూ పోస్టులు పెడుతుంది.

Rashmika Mandanna : సమంతని అమ్మలా దగ్గరుండి చూసుకోవాలని ఉంది..

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన హెల్త్ గురించి పోస్ట్ చేసి కొత్త సంవత్సరంలో అందరికి బ్యాడ్ న్యూస్ చెప్పింది పునర్నవి. తన స్టోరీలో డల్ గా ఉన్న తన ఫేస్ ని పోస్ట్ చేసి దానిపై.. గత కొన్ని రోజులుగా నేను ఛాతికి సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఇలా అనారోగ్యంతో ఎక్కువ రోజులు ఉండటం నాకు ఇదే మొదటిసారి. ఇదే చివరిసారి కావాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం అనారోగ్యంగానే ఉన్నాను కానీ చికిత్స తీసుకుంటున్నాను. త్వరగానే కోలుకుంటాను, దీంతో ఫైట్ చేస్తాను అని తెలిపింది. పునర్నవి త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు, నెటిజన్లు కోరుకుంటున్నారు.