Powerball Lottery: జాక్ పాట్ అంటే ఇదే కదా.. పవర్​బాల్​ లాటరీలో రూ.6500 కోట్లు గెలిచిన సామాన్యుడు!

Kaburulu

Kaburulu Desk

February 7, 2023 | 09:42 PM

Powerball Lottery: జాక్ పాట్ అంటే ఇదే కదా.. పవర్​బాల్​ లాటరీలో రూ.6500 కోట్లు గెలిచిన సామాన్యుడు!

Powerball Lottery: ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో అదృష్టం తలుపు తడుతుందని పెద్దల నమ్మకం. అలాంటి సందర్భాల్లో కటిక పేదరికంలో ఉన్నవాళ్లు కూడా అపర కుబేరులుగా మారిపోతుంటారు. చేతిలో చిల్లిగవ్వలేని వారు అదృష్టం వరించి కోటేశ్వర్లు అవుతుంటారు. సుడి వుండాలి కానీ అదృష్టం సముద్రాల ఆవల వున్నా పరుగెత్తుకుని వచ్చేస్తుంది. అలాంటి జాక్ పాటే ఇదీ.

సాధారణంగా లాటరీ అంటే నూటికో కోటికో ఒక్కడికి వస్తుంది.. మనకెందుకు వస్తుందిలే ఏం కొనుక్కుంటాం అనుకుంటారు కొందరు. కానీ, అసలు అవి తగిలినప్పుడు వుంటుంది అసలు మజా. ఉన్న దరిద్రాన్ని అంతా ఊడ్చి అవతల పారేస్తుంది ఆ ఒక్క లాటరీ. ఇప్పుడు ఇది అలాంటిదే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.6500 కోట్లు గెలుచుకున్నాడు ఓ సామాన్య వ్యక్తి. అమెరికాలోని వాషింగ్టన్ లో జరిగింది.

అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఓ వ్యక్తికి లాటరీలో ఏకంగా రూ.6,500 కోట్లకు పైగా గెలుచుకున్నారు. అమెరికా డాలర్లలో 754.6 మిలియన్ల డాలర్లు కాగా.. మన కరెన్సీలో చూస్తే రూ.6500 కోట్లకు పైమాటే ఉంటుంది. పవర్ బాల్ గేమ్ లాటరీలో ఈ జాక్ పాట్ తగిలింది. పవర్ బాల్ లాటరీలో ఓ వ్యక్తి కొన్న టికెట్ మొత్తం ఆరు నంబర్లు (05,11,22,23,69,07)తో సరిపోలిందని.. దీని మొత్తం విలువ రూ.6,536.46 కోట్లకు పైనేనని లాటరీ నిర్వాహకులు ప్రకటించారు.

అయితే ఈ నగదు మొత్తాన్ని విజేతకు విడతలవారీగా చెల్లిస్తారు. తొలుత కొంతభాగం ఇచ్చేసి 29 సంవత్సరాల వరకు మిగతా మొత్తాన్ని దశలవారీగా చెల్లిస్తారు. దీనికి సంవత్సరానికి 5 శాతం వడ్డీని కూడా కలుపుతారు. అలా కాదు అంటే ఇప్పటికిప్పుడే 407.2 మిలియన్ల డాలర్లను ఒకేసారి అందజేస్తారు. 2022 నవంబర్ 19 తర్వాత ఇదే
అతిపెద్ద లాటరీ విన్నింగ్ కాగా.. అమెరికా చరిత్రలోనే ఇది తొమ్మిదవ అతిపెద్ద లాటరీ అని పవర్ బాల్ లాటరీ నిర్వాహకులు వెల్లడించారు.