Idly Batter : ఫ్రిడ్జ్ లేకుండా ఇడ్లీ పిండి, అట్ల పిండిని స్టోర్ చేయడం ఎలా ?

 ఇడ్లీ పిండి, అట్ల పిండి కూలింగ్ ప్రదేశాల్లో ఉంచకపోతే తొందరగా పుల్లగా మారిపోతుంది, పాడైపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం ఎలా ఉంచినా అవి..................

Kaburulu

Kaburulu Desk

January 27, 2023 | 07:55 PM

Idly Batter : ఫ్రిడ్జ్ లేకుండా ఇడ్లీ పిండి, అట్ల పిండిని స్టోర్ చేయడం ఎలా ?

Idli Batter :  ఇడ్లీ పిండి, అట్ల పిండి కూలింగ్ ప్రదేశాల్లో ఉంచకపోతే తొందరగా పుల్లగా మారిపోతుంది, పాడైపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం ఎలా ఉంచినా అవి ఒకరోజు బాగుంటాయి. కానీ రెండో రోజుకి పులిసిపోతాయి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు అలా ఇడ్లీ పిండి, అట్ల పిండి పులియకుండా, పాడవకుండా రెండు, మూడు రోజులు ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

*పిండిని కలుపుతున్నప్పుడు ఒక గరిటతో బాగా కలపాలి. ఎందుకంటే చేత్తో కలిపినప్పుడు చేయి వేడి వలన పిండి త్వరగా పులిసిపోయే అవకాశం ఉంది.
*ముందుగా గ్రైండర్ను చేతితో బాగా కడగాలి. ఎందుకంటే ఆఖరి పిండిలో పులుపు ఉంటుంది. కాబట్టి నీళ్లతో బాగా కడగాలి. బాగా కడిగిన తరువాతే, తర్వాత పిండి వేసుకోవాలి.
*బియ్యాన్ని కానీ పప్పులు గాని మూడు నాలుగు గంటలు మాత్రమే నానబెట్టాలి. కొంతమంది రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పిండి రుబ్బుతారు. ఇలా చేయడం వల్ల కూడా త్వరగా పులిసిపోయే అవకాశం ఉంటుంది.
*ఇడ్లీ కోసం మినప్పప్పును రెండు గంటలు నానబెడితే సరిపోతుంది. అలాగే రుబ్బేటప్పుడు 20 నుండి 25 నిమిషాల తర్వాత బబుల్స్ రాగానే తీసివేయాలి.
* గ్రైండర్లో ప్రధానంగా మినప్పప్పు, బియ్యాన్ని విడివిడిగా రుబ్బుకోవాలి కలిపి మెత్తగా రుబ్బకూడదు.
* వేరు వేరు కంటైనర్లలో సెనగపిండి, బియ్యప్పిండి ని మార్చేటప్పుడు చేతులు తగలకుండా జాగ్రత్తపడాలి .
*ఫ్రిడ్జ్ లేనివాళ్లు కొంతమంది ఇప్పటికీ పిండిని పెద్ద పాత్రలో నీళ్లు పోసి దానిపై పిండి పాత్రను ఉంచుతారు. అలా చేస్తే కూడా త్వరగా పులియకుండా ఉంటుంది.
*ఇడ్లీ పిండిపై అరటి ఆకు ముక్కలు వేసి మూత పెడితే ఆ పిండి రెండు రోజులపాటు కూడా అలాగే ఉంటుంది.