Unstoppable : అన్‌స్టాపబుల్ పవర్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్.. పవర్ స్టార్ పంచులే.. పంచులు..

ఈ ఎపిసోడ్ ప్రోమోలో బాలయ్య, పవన్ ఎంట్రీ అదిరిపోయింది. బాలయ్య బండ్లన్న స్పీచ్ లో ఈశ్వర, పవనేశ్వర అని మొదలుపెట్టారు. ఇక బాలయ్య మాటలకు పవన్ వరుసగా కామెడీగా కౌంటర్లు వేశారు. బాలయ్య, పవన్ ఒకరికొకరు.............

Kaburulu

Kaburulu Desk

January 27, 2023 | 07:40 PM

Unstoppable : అన్‌స్టాపబుల్ పవర్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్.. పవర్ స్టార్ పంచులే.. పంచులు..

Unstoppable :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీ లో వస్తున్న అన్‌స్టాపబుల్ షో ఎంత బాగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుందో మన అందరికి తెలిసిందే. ఇప్పటికే సెకండ్ సీజన్ లో ప్రభాస్ ఎపిసోడే తో ఈ షో ఇండియా వైడ్ పాపులర్ అయిపోయి సరికొత్త రికార్డులని క్రియేట్ చేసింది. ఇప్పుడు పవర్ స్టార్ ఎపిసోడ్ తో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయబోతుంది.

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ ఎపిసోడ్ షూట్ జరగడంతో ఈ రేర్ కాంబినేషన్ కి అంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కోసం పవన్ అభిమానులు, బాలయ్య అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక వీరిద్దరూ రెండు పార్టీలకు చెందినవారు కావడంతో ఏపీ రాజకీయాలు చర్చకి వస్తాయని అటు ఏపీ నాయకులు కూడా ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా బాలయ్య, పవన్ ఎపిసోడ్ టీజర్ ని రిలీజ్ చేశారు.

ఈ ఎపిసోడ్ ప్రోమోలో బాలయ్య, పవన్ ఎంట్రీ అదిరిపోయింది. బాలయ్య బండ్లన్న స్పీచ్ లో ఈశ్వర, పవనేశ్వర అని మొదలుపెట్టారు. ఇక బాలయ్య మాటలకు పవన్ వరుసగా కామెడీగా కౌంటర్లు వేశారు. బాలయ్య, పవన్ ఒకరికొకరు పంచులు వేసుకున్నారు. ఫ్యామిలీ విషయాలు, త్రివిక్రమ్ గురించి, మూడు పెళ్లిళ్ల గురించి, పవర్ స్టార్ గా ఎదగడం గురించి, పవన్ బాలయ్య మొదటిసారి కలవడం గురించి మాట్లాడారు. దీంతో ఈ ఎపిసోడ్ ఓ పక్క సరదాగా ఉంటూనే మరోపక్క సీరియస్ అంశాలు కూడా మాట్లాడబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఎపిసోడ్ మధ్యలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా వచ్చి సందడి చేసాడు.

Dhoni : లవ్‌టుడే హీరోయిన్‌తో లెట్స్ గెట్ మ్యారీడ్ అంటున్న ధోని..

ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేసినట్టే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు పార్ట్ 1 ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 3న ఆహాలో స్ట్రీమ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ పవర్ ఫుల్ అన్‌స్టాపబుల్ ప్రోమో ట్రెండింగ్ లో ఉంది. ఎపిసోడ్ కోసం పవన్, బాలయ్య అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ రిలీజ్ అయితే ఆహాలో సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయం అంటున్నారు అభిమానులు.