Cockroaches : ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా? వాటిని తరిమికొట్టడానికి ఈ టిప్స్ పాటించండి..

బొద్దింకలు మన ఇంటిలో ఎప్పుడూ కనబడుతూనే ఉంటాయి. ఉదయం పూట మనకు కనబడకపోయినా రాత్రి సమయానికి ఎక్కడి నుండి అయినా వచ్చి చేరతాయి. ఇవి మన ఇంటిలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతుంటాయి. వీటి వలన మనకు ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. కాబట్టి వీటిని పోగొట్టడానికి............

Kaburulu

Kaburulu Desk

February 5, 2023 | 03:00 PM

Cockroaches : ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా? వాటిని తరిమికొట్టడానికి ఈ టిప్స్ పాటించండి..

Cockroaches :  బొద్దింకలు మన ఇంటిలో ఎప్పుడూ కనబడుతూనే ఉంటాయి. ఉదయం పూట మనకు కనబడకపోయినా రాత్రి సమయానికి ఎక్కడి నుండి అయినా వచ్చి చేరతాయి. ఇవి మన ఇంటిలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతుంటాయి. వీటి వలన మనకు ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. కాబట్టి వీటిని పోగొట్టడానికి కొన్ని చిట్కాలను మనం వాడితే అవి ఇంటిలోనుండి బయటకు పోతాయి.

*కిరోసిన్ వాసన అనేది బొద్దింకలకు పడదు. కాబట్టి కిరోసిన్ ని నీళ్ళల్లో కలిపి దానిని మన ఇంటిలో బొద్దింకలు ఎక్కువగా తిరిగే చోట, సింక్ కింద, ఇంటి మూలల్లో జల్లాలి అప్పుడు బొద్దింకలు రాకుండా ఉంటాయి.
*హెయిర్ స్ప్రే గనుక మీ ఇంట్లో వాడుతున్నట్లైతే దానిని స్ప్రే చేసినా కూడా బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి.
*మంచి ఘాటు వాసన వచ్చే లవంగాలు బొద్దింకలు తిరిగే చోట పెట్టడం వలన బొద్దింకలు రాకుండా ఉంటాయి.
*బిర్యానీ ఆకును కూడా మనం బొద్దింకలు ఉన్న చోట పెట్టవచ్చు. దీని వాసన వలన బొద్దింకలు రాకుండా ఉంటాయి.
*మంచి ఘాటు వాసన వచ్చే దాల్చిన చెక్క ను పొడి చేసి దానిని ఉప్పులో కలిపి దానిని బొద్దింకలు తిరిగే చోట, ఇంటి మూలల్లో పెట్టడం వలన బొద్దింకలు పోతాయి. ఇలా చేయడం వలన బొద్దింకలు పెట్టిన గుడ్లు ఉంటే అవి కూడా నాశనం అవుతాయి.
*వేప ఆకులను బొద్దింకలు తిరిగే చోట పెట్టాలి వాటిని రోజూ మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన బొద్దింకలు రావడం తగ్గుతాయి. వేప నూనెను వేడి నీళ్లను కలిపి స్ప్రే చేయడం వలన కూడా బొద్దింకలు పోతాయి.
*తాజా కీరదోసకాయ తొక్కను తీసి బొద్దింకలు తిరిగే చోట పెట్టిన బొద్దింకలు వాటి వాసనకు రావు. కీరదోసకాయ ముక్కలను బాగా ఎండబెట్టాలి. బాగా ఎండిన వాటిని బొద్దింకలు ఉన్నచోట పెడితే వాటికి కూడా బొద్దింకలు రాకుండా ఉంటాయి.
* స్టికీ టేప్ ను ఇంటిలో బొద్దింకలు తిరిగే చోట పెడితే దానికి అతుక్కుంటాయి. అవి కదలకుండా ఉండటం వల్ల మనం వాటిని తీసి పడేయొచ్చు, ఇంకోసారి అవి రావు కూడా.