Shopping : షాపింగ్ ఖర్చు ఎక్కువైందని బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..

Kaburulu

Kaburulu Desk

December 6, 2022 | 06:03 PM

Shopping : షాపింగ్ ఖర్చు ఎక్కువైందని బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..

Shopping :  షాపింగ్ చేయడం అనేది మనం అందరం తరచూ చేసే పనే. కానీ ఈ మధ్య కాలంలో మాల్స్ అనేవి ఎక్కువగా ఉండడం, బయట రోడ్ల మీద అమ్మకాలు పెరగడం వలన షాపింగ్ అని వెళ్లడం మనకు అవసరం ఉన్నవి లేనివి కూడా కొనడం చేస్తున్నారు అందరూ. కాబట్టి మనం అనుకున్న దాని కన్నా ఖర్చు అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఈ ఖర్చును అదుపులో ఉంచడానికి మనం కొన్ని పద్దతులను పాటించొచ్చు.

మనం మొదటగా బయటకు వెళ్లాల్సి వచ్చినపుడు మనం ఏ పని మీద వెళుతున్నాము అక్కడ ఏమి కొనుగోలు చేయాలి అనుకుంటామో వాటిని లిస్ట్ రాసుకోవాలి. అప్పుడు దాని ప్రకారంగా మాత్రమే మనం వస్తువులను కొనుగోలు చేసుకోవాలి. లిస్ట్ లో లేని వస్తువులను కూడా మనం మాల్స్ లోనికి వెళ్ళినపుడు వేసుకుంటూ ఉంటే వాటిని మనం తీసేయాలి అప్పుడే ఖర్చును తగ్గించుకోవచ్చు.

మనం మాల్స్ లోకి వెళ్ళినపుడు ఎక్కువగా ఆఫర్స్ ఉన్నవాటిని చూసి అవసరం లేకపోయినా కొనేస్తూ ఉంటాము కానీ మనకు అవి ఎంతవరకు అవసరమో చూసుకొని కొనుక్కోవాలి. మనం ఒక్కసారి వాడడానికి, లేదా ఎప్పుడో ఒకసారి వాడటానికి ఉపయోగపడేవి కూడా ఆఫర్స్ పెట్టారని కొనేస్తూ ఉంటాము. దాన్ని తగ్గించుకొని మనకి రోజూ ఉపయోగపడుతుంది అనుకుంటేనే కొనుక్కోవాలి. అలాగే మాల్స్, మార్ట్స్ లో డేట్ ఎక్స్‌పైర్ అవుతున్నాయి త్వరలో అనుకున్నవే ఎక్కువగా ఆఫర్స్ పెడతారు. కాబట్టి ఆఫర్స్ లో కొనే ముందు ఒకసారి వాటి ఎక్స్‌పైర్ డేట్ చూడండి. దానివల్ల కూడా ఈ ఆఫర్స్ నుంచి బయట పడొచ్చు.

ఏ వస్తువైనా కొనేటప్పుడు అది మనం ఎన్నిసార్లు వాడుకుంటాము అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకొని కొనాలి. కొన్ని వస్తువులు బయట కంటే కూడా ఆన్లైన్ లో తక్కువకి దొరుకుతాయి, కొన్ని బయట తక్కువకి దొరుకుతాయి. కాబట్టి మనం కొనుక్కునేముందు ఆన్లైన్ లో ఒకసారి ప్రైజ్ చెక్ చేస్తే మన ఖర్చు తగ్గుతుంది. ఇక మనం ఇంట్లోకి కొనాల్సినవి వెళ్ళినప్పుడు సాధ్యమైనంతవరకు పిల్లల్ని తీసుకెళ్లకపోవడమే మంచిది. పిల్లలతో వెళ్తే కనపడినవన్నీ కొనమంటారు.

Boiled Egg : గుడ్డు ఇలాగే తినండి.. ఇలా తింటేనే ఆరోగ్యం..

అలాగే ఇటీవల చాలా మంది క్రెడిట్ కార్డ్స్ వచ్చాక ముందు ఖర్చు పెట్టేసి తర్వాత బిల్ కట్టేటప్పుడు బాధపడుతున్నారు. కావున షాపింగ్ చేసే సమయంలో క్యాష్ ని మెయింటైన్ చేయండి. లిక్విడ్ క్యాష్ తో షాపింగ్ చేస్తే మన దగ్గర ఉన్నంతే కొంటాం. అనవసరంగా క్రెడిట్ కార్డ్స్ వాడి తర్వాత బాధపడం. ఇలా అన్ని ఆలోచించి చేస్తే మన షాపింగ్ ఖర్చును అదుపు చేసుకోవచ్చు.