Boiled Egg : గుడ్డు ఇలాగే తినండి.. ఇలా తింటేనే ఆరోగ్యం..

Kaburulu

Kaburulu Desk

December 6, 2022 | 05:45 PM

Boiled Egg : గుడ్డు ఇలాగే తినండి.. ఇలా తింటేనే ఆరోగ్యం..

Boiled Egg :  అందరూ పోషక ఆహరం తినాలని అనుకుంటున్నారు కానీ అన్ని పోషకాలు మన శరీరానికి అందాలంటే రోజుకు ఒక గుడ్డు తినాలి. రోజుకు ఒక గుడ్డు తింటే దాని వలన మన శరీరానికి పోషకాలను అందించవచ్చు. అయితే గుడ్లను మనం ఎన్నో రకాలుగా తింటూ ఉంటాము. ఆమ్లెట్, ఎగ్ ఫ్రై , ఎగ్ కర్రీ, ఎగ్ పఫ్.. ఇలా రకరకాలుగా తింటారు. కానీ వీటన్నింటి కంటే ఎగ్ ను ఉడకబెట్టి తింటేనే మంచి పోషకాలు లభిస్తాయి.

గుడ్డులో ఉండే విటమిన్ బి కాంప్లెక్స్, జింక్ మన శరీరంలోని రోగనిరోధకశక్తిని పెంచుతాయి. చలికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ వంటి వాటిని నివారించడంలో ఎంతో సహాయపడుతుంది. చలికాలంలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుడ్డు తినడం వలన ఇది మన శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. మనకు చలికాలంలో వచ్చే ఇబ్బందులను తగ్గించుకోవడానికి గుడ్డు ఎంతో ఉపయోగపడుతుంది.

Weak Up Early : ఉదయాన్నే నిద్ర లేవండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

గుడ్డులో ఉండే అమైనో ఆమ్లాలు క్యాలరీలను తక్కువగా మన శరీరానికి అందేలా చేస్తాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతో శక్తిని అందిస్తుంది మరియు బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది. గుడ్డులో ఉండే విటమిన్ ఏ మనకు కంటికి సంబంధించిన సమస్యలను త్వరగా రాకుండా ఉండేలా చేస్తుంది. ఫ్రై చేసిన గుడ్డు తింటే చెడు కొలెస్ట్రాల్ మన శరీరంలోనికి చేరుతుంది. కాబట్టి ఉడికించిన గుడ్డు తింటేనే మన ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. అందుకే రోజుకి ఒక ఉడికించిన గుడ్డు తినండి.