Hema Malini : హేమమాలిని 74 ఏళ్ళు వచ్చినా ఇంత అందం.. బ్యూటీ టిప్స్ సీక్రెట్స్ ఏంటో తెలుసా?

Kaburulu

Kaburulu Desk

December 6, 2022 | 06:14 PM

Hema Malini : హేమమాలిని 74 ఏళ్ళు వచ్చినా ఇంత అందం.. బ్యూటీ టిప్స్ సీక్రెట్స్ ఏంటో తెలుసా?

Hema Malini :  హేమమాలిని ఒకప్పటి స్టార్ హీరోయిన్. ఆవిడ తెలుగు, హిందీ, తమిళ్ తో పాటు ఇంకా ఎన్నో రకాల భాషలలో నటించారు. ఇపుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఆమె వయసు 74 అయినా ఆమె అందం ఎవర్ గ్రీన్ లాగానే కనిపిస్తున్నారు. ఆమె అలా ఉండడానికి ఆమె పాటించే చిట్కాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

ఆ ఇంటర్వ్యూలో హేమమాలిని తన బ్యూటీ సీక్రెట్స్ గురించి చెప్తూ.. చర్మంపై ముడతలు అనేవి కనబడకుండా ఉండడానికి ముఖంపై అరోమా ఆయిల్ తో మసాజ్ చేసుకుంటూ ఉంటానని, అలా చేయడం వల్ల ముఖంపై ముడతలను తగ్గించి యంగ్ గా కనబడేలా చేస్తుందని చెప్పింది. అలాగే ముఖం కాంతివంతంగా, తాజాగా కనబడడానికి రోజూ తగినన్ని మంచి నీరు, కొబ్బరి నీళ్లు తాగాలి అని చెప్పారు. డైలీ భోజనంలో తప్పకుండా పెరుగు తింటానని చెప్పింది.

Shopping : షాపింగ్ ఖర్చు ఎక్కువైందని బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..

ఈ చిట్కాలతో పాటు రోజూ క్రమం తప్పకుండా జిమ్, వ్యాయామం, యోగా, సైక్లింగ్, డ్యాన్సింగ్ వంటివి చేస్తూ ఉంటానని చెప్పారు. ఇలా అన్నీ ఫాలో అవుతూ ఇప్పటికి కూడా అంతే అందంగా, ఆనందంగా, ఎనర్జీగా ఉన్నారు హేమమాలిని.