Meal Maker Pakodi : మిల్మేకర్ పకోడీ తిన్నారా?? ఇంట్లో సింపుల్ గా ఇలా చేసేసుకోండి..

మిల్మేకర్ అనేది ఎక్కువగా పలావ్, బిర్యానీలలో వాడుతుంటారు. ఇంకా వాటితో కుర్మా కూర, దాల్చా వంటివి వండుకుంటారు. మిల్మేకర్ తో చేసే వంటలను పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ తినని వారు కూడా మిల్మేకర్ తో చేసిన.................

Kaburulu

Kaburulu Desk

February 10, 2023 | 06:31 AM

Meal Maker Pakodi : మిల్మేకర్ పకోడీ తిన్నారా?? ఇంట్లో సింపుల్ గా ఇలా చేసేసుకోండి..

Meal Maker Pakodi :  మిల్మేకర్ అనేది ఎక్కువగా పలావ్, బిర్యానీలలో వాడుతుంటారు. ఇంకా వాటితో కుర్మా కూర, దాల్చా వంటివి వండుకుంటారు. మిల్మేకర్ తో చేసే వంటలను పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ తినని వారు కూడా మిల్మేకర్ తో చేసిన వంటలను తినడం వలన ఎక్కువ పోషకాలను పొందవచ్చు. అలాగే మిల్మేకర్ తో సాయంత్రం పూట స్నాక్స్ లో పకోడీ కూడా వండుకోవచ్చు.

మిల్మేకర్ పకోడికి కావలసిన పదార్థాలు:-

* మిల్మేకర్ గ్రాన్యూల్స్ ఒక కప్పు
* ఉల్లిపాయలు నాలుగు సన్నగా తరిగినవి
* పచ్చిమిర్చి ఆరు వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
* కొత్తిమీర కొద్దిగా
* కరివేపాకు కొద్దిగా
* జీలకర్ర కొద్దిగా
* కందిపప్పు పొడి కొద్దిగా
* ఉప్పు తగినంత
* నూనె వేపుడుకు తగినంత

White Hair : ఈ పదార్థాలు తింటున్నారా? కచ్చితంగా తెల్లజుట్టు త్వరగా వచ్చేస్తుంది..

ముందుగా ఒక గిన్నెలో మిల్మేకర్ గ్రాన్యూల్స్ ని ఉడికించాలి. ఆ తర్వాత వాటిలోని నీటిని వడబోసి మిల్మేకర్ ని చల్లారబెట్టాలి. తరువాత ఒక పెద్ద గిన్నెలో మిల్మేకర్లను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు అన్నింటిని వేసి బాగా కలపాలి. జీలకర్ర, కందిపప్పు పొడిని కూడా కలపాలి. పొయ్యి మీద ఒక మూకుడులో నూనెను కాగబెట్టాలి. నూనె కాగిన తరువాత మనం కలిపిన పిండిని పకోడీ షేప్ లా వచ్చేలా నూనెలో వేయాలి. బాగా వేగిన తరువాత మూకుడులోనుండి తీయాలి. వేడి వేడి మిల్మేకర్ పకోడీ మీకు తయారైనట్లే. కందిపొడి కాకుండా శనగపిండి కూడా వాడుకోవచ్చు.