Sharwanand : ఒకే ఒక జీవితం ట్రైలర్.. అమ్మకోసం టైం ట్రావెల్.. సరికొత్త ప్రయోగంతో రాబోతున్న శర్వా..

Kaburulu

Kaburulu Desk

September 2, 2022 | 12:42 PM

Sharwanand : ఒకే ఒక జీవితం ట్రైలర్.. అమ్మకోసం టైం ట్రావెల్.. సరికొత్త ప్రయోగంతో రాబోతున్న శర్వా..

Sharwanand :  కొత్త కొత్త కథలతో ప్రయోగాలు చేయడంలో ముందుంటాడు శర్వానంద్. కానీ గత కొంతకాలంగా హిట్లు లేక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. హిట్లు లేకపోయినా తన ప్రయోగాలు మాత్రం ఆపట్లేదు.తాజాగా ఒకేఒక జీవితం అనే సినిమాతో రాబోతున్నాడు. అయితే ఇది టైం ట్రావెల్ కథతో పాటు అమ్మ సెంటిమెంట్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో శర్వాకి ఫ్రెండ్స్ గా వెన్నెల కిషోర్, ప్రియదర్శి నటించగా, రీతూ వర్మ హీరోయిన్ కాగా, అమల మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో శర్వా పాత్రకి తల్లిగా నటిస్తుంది. సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి.

తాజాగా ఒకే ఒక జీవితం సినిమా నుంచి ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్లో.. శర్వా ఒక సింగర్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. ఫ్రెండ్స్ తో కలిసి ఒకసారి సైంటిస్ట్ పాత్ర నాజర్ దగ్గరికి వెళ్తే అతను టైం ట్రావెల్ చేసి వాళ్ళ చిన్నతనానికి తీసుకెళ్తాడు. చిన్నప్పుడు జరిగిన కొన్ని నష్టాలని మార్చాలని హీరో ప్రయత్నించగా ఏమవుతుంది? తన తల్లితో హీరోకి ఉన్న అనుబంధం? హీరో సింగర్ అవుతాడా? లేదా అని చూపించారు.

ఇక ఈ సినిమాని తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి సెప్టెంబర్ 9న రిలీజ్ చేయనున్నారు. తమిళ్ లో ప్రమోషన్స్ కోసం హీరో కార్తీ ఈ సినిమాలో ఓ సాంగ్ ని కూడా పాడారు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకని నిర్వహించనున్నారు. ఈ టైం ట్రావెల్, అమ్మ సెంటిమెంట్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని శర్వానంద్ ఎదురుచూస్తున్నాడు.