Pawan Kalyan : పవర్ గ్లాన్స్.. హరిహరమల్లు నుంచి పవన్ స్పెషల్ వీడియో.. పండగ చేసుకుంటున్న అభిమానులు..

Kaburulu

Kaburulu Desk

September 2, 2022 | 11:02 AM

Pawan Kalyan : పవర్ గ్లాన్స్.. హరిహరమల్లు నుంచి పవన్ స్పెషల్ వీడియో.. పండగ చేసుకుంటున్న అభిమానులు..

Pawan Kalyan :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఆయన సినిమా రిలీజ్ అయినా, ఆయన సభ పెట్టినా జనాలు తరలి వస్తారు. ఇక ఆయన పుట్టిన రోజు అయితే అభిమానులకి పండగే. నేడు సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

ఇక పవన్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ సినిమాలకి టైం ఇవ్వట్లేదు. మధ్యలో కొంత గ్యాప్ తీసుకొని వరుస సినిమాలు ఒప్పుకున్నా పవన్ ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేయడానికి టైం కుదరట్లేదు. ఇప్పటికే పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉండగా అందులో ఒకటి సెట్స్ మీద ఉంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతుంది. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండి డేట్స్ ఇవ్వకపోవడం వల్ల సినిమా ఆలస్యంగా షూట్ జరుగుతుంది.

తాజాగా నేడు పవన్ పుట్టిన రోజు సందర్భంగా హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ అభిమానులకి సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి పవర్ గ్లాన్స్ పేరుతో ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ వీడియోలో పవన్ కుస్తీ యోధులతో పోటీ పడటం, పవన్ తొడ కొట్టడం చూపించారు, పవన్ ని చాలా పవర్ ఫుల్ గా చూపించారు. చివర్లో పవన్ కళ్యాణ్ అలా సీరియస్ గా నడుస్తూ రావడం చూపించి బర్త్ డే విషెష్ తెలిపారు. ఈ వీడియో అభిమానులకి కన్నుల పండుగా ఉంది. పవన్ సినిమాల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి ప్రస్తుతం ఈ వీడియో రిలీజ్ అవ్వడంతో వైరల్ గా మారింది. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. త్వరగా షూట్ కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ చేయాలని పవన్ అభిమానులు ఆశిస్తున్నారు.