Sharwanand : ఒక చెడ్డ సినిమా చేసి అది హిట్ అంటే.. ప్రేక్షకులని మోసం చేస్తున్నట్టే.. వాళ్ళకి అన్ని తెలుసు..

Kaburulu

Kaburulu Desk

September 18, 2022 | 09:07 AM

Sharwanand : ఒక చెడ్డ సినిమా చేసి అది హిట్ అంటే.. ప్రేక్షకులని మోసం చేస్తున్నట్టే.. వాళ్ళకి అన్ని తెలుసు..

Sharwanand :  శర్వానంద్ హీరోగా అమల ముఖ్యపాత్రలో కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒకేఒక జీవితం సినిమా ఇటీవల రిలీజయి మంచి విజయం సాధించింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ కి అమ్మ సెంటిమెంట్ ని జోడించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. సినిమాపై ప్రేక్షకులు, ప్రముఖులు అంతా అభినందనలు కురిపిస్తున్నారు. శర్వానంద్ చాలా రోజుల తర్వాత ఒకేఒక జీవితం సినిమాతో సక్సెస్ అందుకున్నాడు.

దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్స్ నిర్వహిస్తుంది. అయితే ఇటీవల కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా హిట్ అంటూ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. దీనిపై తాజాగా నిర్వహించిన ఒకేఒక జీవితం సక్సెస్ మీట్ లో శర్వానంద్ ని విలేఖరులు ప్రశ్నించారు. ఇటీవల కొంతమంది సినిమా ఫ్లాప్ అయినా హిట్ అని చెప్పుకుంటున్నారు దీనిపై మీ స్పందనేంటి అని అడిగారు.

Sonal Chauhan: నా డ్రీమ్ నెరవేరింది.. ‘ఆదిపురుష్’ గురించి లీక్ చేసిన సోనాల్ చౌహాన్..

శర్వానంద్ దీనికి సమాధానమిస్తూ.. ”నా వరకైతే నేను సక్సెస్, ఫెయిల్యూర్స్ ని ఒప్పుకుంటాను. ఇటీవల నా సినిమా ప్రమోషన్స్ లో కూడా నా గత సినిమాలు ఫ్లాప్ అనే చెప్పుకున్నాను. ఒక చెడ్డ సినిమా తీసి దానికి హిట్ అని చెప్పుకుంటే ప్రేక్షకులని మోసం చేసినట్టే అవుతుంది. ప్రేక్షకులకి ఏది మంచి సినిమానో, ఏది కాదో తెలుసు. సినిమా రిజల్ట్ ఏది వస్తే అది ఒప్పుకుంటే మనకే మంచిది. ఫ్లాప్ అయిన సినిమాని హిట్ అని చెప్పుకోవడం కచ్చితంగా తప్పే” అని అన్నారు.